ZEEL-SPNE Signs: జీల్- సోనీ విలీన ప్రక్రియ, నిర్ణయాత్మక ఒప్పందాలపై పూర్తయిన సంతకాలు

ZEEL-SPNE Signs: ప్రతిష్ఠాత్మక జీల్, సోనీ నెట్‌వర్క్స్ విలీన ప్రక్రియ ముగిసింది. కీలకమైన ఒప్పందంపై రెండు సంస్థల సంతకాల ప్రక్రియ పూర్తయింది. రెండు సంస్థ విలీనంతో కొత్తగా ఏర్పడిన ఉమ్మడి సంస్థ త్వరలో పబ్లిక్ లిస్టింగ్ కానుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 22, 2021, 11:03 AM IST
  • SPNI లో ZEEL విలీనంపై నిర్ణయాత్మక ఒప్పందాలు
  • విలీనం కానున్న రెండు సంస్థల నియర్ నెట్‌వర్క్స్, డిజిటల్ ఆస్థులు, ప్రొడక్షన్ ఆపరేషన్లు, ప్రోగ్రామ్ లైబ్రరీలు
  • పబ్లిక్ లిస్టింగ్ కానున్న కొత్త ఉమ్మడి కంపెనీ
 ZEEL-SPNE Signs: జీల్- సోనీ విలీన ప్రక్రియ, నిర్ణయాత్మక ఒప్పందాలపై పూర్తయిన సంతకాలు

ZEEL-SPNE Signs: ప్రతిష్ఠాత్మక జీల్, సోనీ నెట్‌వర్క్స్ విలీన ప్రక్రియ ముగిసింది. కీలకమైన ఒప్పందంపై రెండు సంస్థల సంతకాల ప్రక్రియ పూర్తయింది. రెండు సంస్థ విలీనంతో కొత్తగా ఏర్పడిన ఉమ్మడి సంస్థ త్వరలో పబ్లిక్ లిస్టింగ్ కానుంది.

ప్రపంచ చరిత్రలో అతిపెద్ద విలీనంగా భావిస్తున్న సోనీ పిక్సర్చ్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్ణయాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఎస్‌పిఎన్ఐలోకి జీల్ విలీనం(ZEEL and SPNI Merger) ద్వారా జీల్‌కు చెందిన లీనియర్ నెట్‌వర్క్స్, డిజిటల్ ఆస్థులు, ప్రొడక్షన్ ఆపరేషన్లు, ప్రోగ్రామ్ లైబ్రరీలు ఎస్‌పీఎన్ఐ పరిధిలో వస్తాయి. రెండు సంస్థలకు సంబంధించిన క్లోజింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఉమ్మడి కొత్త సంస్థ పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లనుంది. అయితే వినియోగదారుల క్లోజింగ్ షరతులు, రెగ్యులేటరీ, షేర్ హోల్డర్లు, థర్డ్ పార్టీ అప్రూవల్స్‌కు లోబడి క్లోజింగ్ లావాదేవీలుంటాయి.

రెండు సంస్థల మధ్య జరిగిన నిర్ణయాత్మక ఒప్పందాల ప్రకారంల సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(SPNI)క్లోజింగ్ బ్యాలెన్స్ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ఎస్‌పీఎన్ఐ షేర్ హోల్డర్లు, జీల్ ప్రమోటర్లు ఉన్నారు. వివిధ వేదికలపై కంటెంట్‌ను ప్రోత్సహించడం, డిజిటల్ ఎకోసిస్టమ్‌ను పెంచడం, అభివృద్ధి చెందుతున్న స్పోర్స్ట్ రంగంలో మీడియా హక్కుల అవకాశాల్ని చేజిక్కించుకోవడం ద్వారా ఉమ్మడి కంపెనీ ప్రయత్నిస్తుంది. 

సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్(Sony Pictures Entertainment) ఇన్‌కార్పొరేషన్ సంస్థకు ఎస్‌పీఎన్ఐ ఒక సబ్సిడయరీగా ఉంది. క్లోజింగ్ అనంతరం ఎస్‌పీఈ పరోక్షంగా 50.86 శాతం వాటాతో మేజర్ షేర్ కలిగి ఉంటుంది. ఇక జీల్‌కు 3.99 శాతం, జీల్ షేర్ హోల్డర్లకు 45.15 శాతం వాటా ఉంటుంది. ఎస్‌పీఎన్ఐ మరో 2.11 శాతం వాటాను కలిగి ఉంటుంది. అదే సమయంలో పునీత్ గోయెంకా కొత్త ఉమ్మడి కంపెనీను లీడ్ చేయడమే కాకుండా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవోగా ఉండనున్నారు. కొత్త సంస్థకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను సోనీ గ్రూప్ నియమించనుంది. క్లోజింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఎస్‌పీఎన్ఐ ప్రస్తుతం ఎండీ, సీఈవో ఎన్‌పిసింగ్ ఎస్‌పీఈకు ఛైర్మన్‌గా విస్తృత స్థాయిలో ఉండనున్నారు. 

నిర్ణయాత్మక ఒప్పందాల్లో భాగంగా జీల్ ప్రమోటర్లు తమ వాటాను కొత్త కంపెనీలో 20 శాతానికి పరిమితం చేసుకునేందుకు అంగీకరించారు. జీల్, ఎస్‌పీఎన్ఐ సంయుక్తంగా కలిసి వ్యాపారాభివృద్ధి, దేశవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాల విస్తరణ, డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపార నిర్వహణ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వేదికలపై కంటెంట్ అభివృద్ధి వంటివి చేయనున్నాయి. అందరికీ ఇదొక నిర్ణయాత్మకమైన మైలురాయి అని..పునీత్ గోయెంకా(Punit Goenka) వ్యాఖ్యానించారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌లో రెండు అగ్రగామి సంస్థల విలీనమనేది భవిష్యత్ ఎంటర్‌టైన్‌మెంట్ శకాన్ని నిర్దేశించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి కొత్త సంస్థ ద్వారా సమగ్రమైన ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌ను సృష్టిస్తుందని..వినియోగదారులకు కావల్సిన కంటెంట్‌ను పూర్తిగా అందిస్తుందని చెప్పారు. జీల్(ZEEL), ఎస్‌పీఈ(SPE), ఎస్‌పీఎన్ఐ సంస్థలు చేసిన కృషికి, నిర్దేశిత సమయంలో విలీనం పూర్తి చేసినందుకు పునీత్ గోయెంకా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. 

Also read: Todays Gold Rate: తగ్గిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News