TATA MICRO SUV PUNCH: మార్కెట్లోకి 'టాటా మైక్రో ఎస్‌యూవీ పంచ్' కారు...ఫీచర్స్ అదుర్స్..

టాటా మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారు మార్కెట్లోకి వచ్చేసింది. ఆసక్తి గల కొనుగోలుదారులు టాటా మోటార్స్ డీలర్ షిప్లు లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ.21,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 04:37 PM IST
  • టాటా మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారు విడుదల
  • ఆకట్టుకుంటున్న ఫీచర్స్
  • నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
TATA MICRO SUV PUNCH: మార్కెట్లోకి 'టాటా మైక్రో ఎస్‌యూవీ పంచ్' కారు...ఫీచర్స్ అదుర్స్..

Tata Micro SUV Punch: ప్రముఖ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌(TATA MOTORS) తన మైక్రో ఎస్‌యూవీ పంచ్‌ కారును ఇవాళ లాంచ్ చేసింది. ఇది ఆల్ఫా-ఎఆర్ సీ(ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్) ఫ్లాట్ ఫారంపై ఆధారపడి పనిచేస్తుంది. ఆల్ట్రోజ్ తరహాలోనే దీనిని అభివృద్ధి చేశారు. ఆసక్తి గల కొనుగోలుదారులు టాటా మోటార్స్ డీలర్ షిప్లు లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ.21,000 చెల్లించి కారును బుక్(Bookings) చేసుకోవచ్చు. 

మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారు(Tata Micro SUV Punch Rates) ధరలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఇండియన్‌ మార్కెట్‌లో గత కొంత కాలంగా ఎస్‌యూవీ వెహికల్స్‌(SUV Vechicles)కి డిమాండ్‌ పెరుగుతోంది. సెడాన్‌లకు ధీటుగా ఎస్‌యూవీ వెహికల్స్‌ అమ్మకాలు సాగుతున్నాయి. అందుకే ఈ కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. టాటా మోటార్స్(Tata Motors) పంచ్ కోసం వర్చువల్ షోరూమ్ కూడా ప్రారంభించింది. 

Also Read: Oneplus: వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే ఆఫర్లు..స్మార్ట్‌ఫోన్స్‌, టీవీలపై భారీ డిస్కౌంట్‌..!

అదిరిపోయే ఫీచర్లు
టాటా పంచ్ వేరియంట్ బట్టి 15 లేదా 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ పై నడుస్తుంది. దీనిలో కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్, 187మి.మి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. టాటా పంచ్ 1.2-లీటర్ రీవోట్రాన్ ఇంజిన్ డైనా-ప్రో టెక్నాలజీతో వస్తుంది. ఇది 86 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీని ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 
సులభంగా డ్రైవింగ్ చేయడం కోసం ఎఎమ్‌టి గేర్ బాక్స్ (AMT gearbox) తో వస్తుంది. ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసం సిగ్నల్స్, ట్రాఫిక్ వద్ద ఇంజిన్ ని ఆటోమేటిక్ గా ఆఫ్ చేయడం కోసం ఐడిల్ స్టార్ట్ స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. టాటా పంచ్ ఇంటీరియర్స్ చాలా విశాలమైన ఫీల్ ఇచ్చేవిధంగా డిజైన్ చేశారు. డ్యాష్ బోర్డ్ 4 అంగుళాల లేదా 7 అంగుళాల హర్మన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో వస్తుంది. టాటా పంచ్ వెనుక సీట్లు చాలా సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. మైక్రో ఎస్ యువి 366 లీటర్ల బూట్ స్పేస్ తో వస్తుంది.

నాలుగు వేరియెంట్లలో లభ్యం
టాటా పంచ్(TATA PUNCH) నాలుగు వేరియెంట్ల(Variants)లో లభ్యం అవుతుంది. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, ఈబిడితో గల ఎబిఎస్, కార్నర్ సేఫ్టీ కంట్రోల్, ఐసోఫీక్స్, బ్రేక్ స్వే కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో ఓర్కస్ వైట్, అటామిక్ ఆరెంజ్, డేటోనా గ్రే, ఉల్కా కాంస్యం, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్, టోర్నడో బ్లూ ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News