UPI Payment: మన దేశపు యూపీఐ ఏయే దేశాల్లో పనిచేస్తుందో తెలుసా

UPI Payment: దేశంలో గత కొద్దికాలంగా ఆన్‌లైన్ లావాదేవీలు విస్తృతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే కన్పిస్తున్నా.యి. మరీ ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఇండియాకు చెందిన యూపీఐలు విదేశాల్లో కూడా చెలామణీలో ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2024, 03:22 PM IST
UPI Payment: మన దేశపు యూపీఐ ఏయే దేశాల్లో పనిచేస్తుందో తెలుసా

UPI Payment: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ స్థూలంగా చెప్పాలంటే యూపీఐ. కరోనా మహమ్మారి సమయం నుంచి యూపీఐ చెల్లింపులతో పెరగడంతో యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు కూడా పెరిగిపోయారు. ఇండియాకు చెందిన యూపీఐలు ఇప్పుడు విదేశాల్లో కూడా వాడుకలో ఉన్నాయి. ఏయే దేశాల్లో ఉన్నాయో తెలుసుకుందాం.

ఇండియాలో గత కొద్దికాలంగా ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి,  5-6 ఏళ్లలో ఆన్‌లైన్ పేమెంట్, ఆన్‌లైన్ షాపింగ్ కూడా విస్తృతంగా పెరిగింది. ఇప్పుడు యూపీఐ చెల్లింపులు ప్రతి గ్రామంలోనూ విస్తరించాయి. దేశంలో డిజిటల్ రివల్యూషన్‌కు యూపీఐ చెల్లింపులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎంతగా అంటే విదేశాల్లో సైతం ఇండియాకు చెందిన యూపీఐ విధానం అమల్లో ఉంటోంది. దేశంలో ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, భారత్ పే వంటి చాలా యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అనేది ఏ పేమెంట్ యాప్ నుంచైనా డబ్బులు సులభంగా క్షణాల్లో పంపించగలిగే వ్యవస్థ. ఇండియాకు చెందిన యూపీఐ వ్యవస్థ దేశంలోనే కాకుండా మరో 7 దేశాల్లో కూడా వాడుకలో ఉంది. అంటే ఈ ఏడు దేశాల్లో కూడా ఏమాత్రం ఆటంకం లేకుండా ఇక్కడి యూపీఐ యాప్ ఆధారంగా పేమెంట్స్ జరుపుకోవచ్చు. ప్రపంచంలోని ఏయే దేశాల్లో ఇండియాకు చెందిన యూపీఐలు పనిచేస్తున్నాయో తెలిపే మ్యాప్‌ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారీ చేసింది. 

ఈ మ్యాప్ పరిశీలిస్తే ఇండియాకు చెందిన డిజిటల్ పేమెంట్ సిస్టమ్ యూపీఐ ఇటీవలే శ్రీలంక, మారిషస్‌లో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని ఏయే దేశాల్లో యూపీఐ పనిచేస్తుందో కూడా వివరంగా మ్యాప్‌లో మార్క్ చేసుంది. 

ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్ దేశాల్లో భారతదేశపు యూపీఐలు పనిచేస్తున్నాయి. ఇండియా కాకుండా ఈ ఏడు దేశాల్లో బారతదేశపు యూపీఐలు పనిచేస్తున్నాయి. ఇటీవల యూఏఈ సందర్శించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈలో యూపీఐ లాంచ్ విషయాన్ని ప్రకటించారు. ఆ దేశానికి చెందిన డిజిటల్ పేమెంట్ సిస్టమ్ AANI భాగస్వామ్యంతో ఇది పని చేస్తుంది. 

Also read: Work From Home Jobs: ఈ ఏడు కంపెనీల్లో శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News