Unclaimed Amount: కేంద్ర ఆర్ధిక మంత్రి శుభవార్త, త్వరలో ఆ ఎక్కౌంట్లలో పడనున్న 35 వేల కోట్లు

Unclaimed Amount: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డబ్బుల విషయంలో కస్టమర్లకు శుభవార్త అందించారు. మొత్తం 35 వేల కోట్లను పంచేందుకు రంగం సిద్ధమౌతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 9, 2023, 10:14 AM IST
Unclaimed Amount: కేంద్ర ఆర్ధిక మంత్రి శుభవార్త, త్వరలో ఆ ఎక్కౌంట్లలో పడనున్న 35 వేల కోట్లు

Unclaimed Amount: ఆర్ధిక స్థిరత్వం అభివృద్ధి మండలి ఎఫ్ఎస్‌డిసి త్వరలో బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ నిధుల్ని తిరిగి చెల్లించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఎఫ్ఎస్‌డిసి సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అసలీ అన్‌క్లెయిమ్డ్ డబ్బుల సంగతేంటి, దేశవ్యాప్తంగా ఎంత ఉంది..

దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల వద్ద ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకుని ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డబ్బులు దాదాపు 35 వేల కోట్లున్నాయి. ఎవరూ క్లెయిమ్ చేయకపోవడం వల్ల ఆ డబ్బులన్నీ ఇటీవలే ఆర్బీఐకు చేరిపోయాయి. భారీ మొత్తం కావడంతో కేంద్ర ఆర్ధికశాఖ దీనిపై కసరత్తు చేసింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డబ్బులు 35 వేల కోట్లను సంబంధిత కుటుంబీకులకు తిరిగి చెల్లించే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. బ్యాంకుల్లోని ఈ డబ్బును సంబంధిత కుటుంబీకులను గుర్తించి ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సమావేశం స్పష్టం చేసింది.

ఏ విధమైన క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన షేర్లు, లాభాలు, మ్యూచ్యువల్ ఫండ్స్, బీమా, ఫిక్స్డ్ డిపాజిట్లను సంబంధిత వ్యక్తులు లేదా నామినీల వరకూ చేర్చేలా ప్రత్యేక కార్యక్రమం నడిపించాల్సిన అవసరముందని ఎఫ్ఎస్‌డిసీ సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సంబంధిత బ్యాంకు అధికారులు అన్‌క్లెయిమ్డ్ డబ్బుల్ని సంబంధిత వ్యక్తులకు చేర్చేలా ప్రత్యేక కార్యక్రమం నడిపించాలని సూచించినట్టు ఆయన చెప్పారు. నామినీ ఉండి ఆ విషయం నామినీకి తెలియని కేసులపై దృష్టి సారించాలన్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఓ పద్ధతి ప్రకారం చేపట్టనున్నారు. నామినీకు సమాచారం లేని కేసులే ప్రధానమన్నారు. 2023 ఫిబ్రవరి నాటికి వివిధ ప్రభుత్వ బ్యాంకుల వద్ద అన్‌క్లెయిమ్డ్ డబ్బులు 35 వేల కోట్లు ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ అయిపోయాయి. ఈ డబ్బంతా పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం నుంచి ఏ విధమైన లావాదేవీలు జరపని ఎక్కౌంట్లకు చెందింది. ఏ విధమైన లావాదేవీల్లేని ఇలాంటి ఖాతాలు 10.24 కోట్లున్నాయి.

3-4 నెలల్లో దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ పోర్టల్ సిద్ధం చేస్తామని ఆర్బీఐ గత నెల స్పష్టం చేసింది. ఈ పోర్టల్ ద్వారా సంబంధిత లబ్దిదారులు విభిన్న బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డబ్బుల వివరాలు తెలుసుకోవచ్చు. ఎఫ్ఎస్‌డీసీ 27వ భేటీలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సహా అధికారులంతా పాల్గొన్నారు. 2023-24 బడ్జెట్‌కు సంబంధించి ఇది తొలి భేటీ.

Also read: Home Loan Tips: ఇంటి రుణం విషయంలో ముఖ్య సూచనలు, తక్కువ వడ్డీ అందించే టాప్ 10 బ్యాంకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News