Bajaj, TVS and Ather Companies plans to Release Affordable Electric Scooters: భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు భారీ ఎత్తున ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చాయి. 2023లో కూడా సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయట. బజాజ్, టీవీఎస్ మరియు ఏథర్‌లు కొత్త వాహనాలను తీసుకురానున్నాయట. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర దాదాపు రూ. 70,000 నుంచి రూ. 80,000 వరకు ఉండే అవకాశం ఉంది. రాబోయే మోడల్ ప్రీమియం వేరియంట్‌ల కంటే కొంచెం చిన్న పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌ను పెంచుకోవడానికి పలు కంపెనీలు మాస్-మార్కెట్ ఉత్పత్తులను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. రాబోయే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, అథర్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.
Bajaj Electric Scooters:
బజాజ్ ఆటో ఐదు స్కూటర్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోందట. 2024-25 నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో 15% వాటాను ఆక్రమించవచ్చట. రాబోయే స్కూటర్లు ప్రస్తుత మోడల్ కంటే తక్కువ ధరలో వస్తాయట. బజాజ్ మొట్టమొదటి సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ (కోడెనేమ్ H107) వచ్చే ఆర్థిక సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. ప్రారంభంలో కంపెనీ నెలకు 2,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుందట.
TVS Electric Scooters:
టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ యొక్క సరసమైన వెర్షన్‌ను తీసుకురానుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి 2024 మొదటి నెలలో ప్రారంభం కానుంది. ప్రారంభంలో కంపెనీ నెలకు 25,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుందట. ప్రస్తుత ఐక్యూబ్ యొక్క సగటు నెలవారీ అమ్మకాలు 9,000.
Ather Electric Scooters:
అథర్ యొక్క సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ (కోడెనేమ్ 450U) 2024లో ప్రారంభించబడవచ్చు. ఇది అథర్ 450X యొక్క తక్కువ స్పెసిఫికేషన్ వేరియంట్ కావచ్చు. ద్విచక్ర వాహన తయారీ సంస్థ నెలకు 30,000 నుంచి 33,000 యూనిట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: IND vs NZ: విజయం ఉత్సాహంలో ఉన్న భారత్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా! తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్
Also Read: DRC Boat Accident: డీఆర్‌సీలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.