UPI Payments Limit: యూపీఐ చెల్లింపులు రోజుకు ఏ బ్యాంకుకు ఎంతో తెలుసా

UPI Payments Limit: యూపీఐ చెల్లింపుల విషయంలో హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ, ఐసీఐసీఐ పరిమితి విధించాయి. యూపీఐ చెల్లింపుల పరిమితి ఏ బ్యాంకుకు ఎంత ఉందనే వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2023, 11:55 AM IST
UPI Payments Limit: యూపీఐ చెల్లింపులు రోజుకు ఏ బ్యాంకుకు ఎంతో తెలుసా

ఆన్‌లైన్ పేమెంట్ ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేసేసింది. నగదు చెల్లింపులు, నగదు బదిలీ ఏదైనా సరే క్షణాల్లో మొబైల్ ఫోన్ ద్వారా చేయవచ్చు. అయితే దీనికి పరిమితి ఉందా లేదా ఉంటే ఎంత వరకూ ఉంటుందనే వివరాలు చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం..యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ విధానంతో మొబైల్ యాప్ ద్వారా వివిధ బ్యాంకు ఎక్కౌంట్లను లింక్ చేయవచ్చు. ఇందులో అత్యంత సులభతరమైన అంశమేమంటే కేవలం ఫోన్ నెంబర్ సహాయంతో యూపీఐ పిన్ వినియోగించి డబ్బులు పంపించవచ్చు. యూపీఐ విధానం ద్వారా ఒక రోజుకు గరిష్టంగా 1 లక్ష రూపాయలవరకూ పంపించవచ్చు. అయితే ఈ పరిమితి అనేది బ్యాంకుని బట్టి మారుతుంటుంది. గూగుల్ పే దేశంలోని వివిధ బ్యాంకుల యూపీఐ పరిమితి ఎంతనే వివరాలు వెల్లడించింది. 

గూగుల్ పే యూపీఐ పేమెంట్స్ పరిమితి

ఎస్బీఐలో యూపీఐ చెల్లింపుల పరిమితి రోజుకు 1 లక్ష రూపాయలు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో యూపీఐ చెల్లింపులు రోజుకు 1 లక్ష రూపాయలు, కొత్త కస్టమర్లకు మాత్రం 5 వేల రూపాయలు మాత్రమే
ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు రోజుకు యూపీఐ పరిమితి 10 వేలు. గూగుల్ పేకు 25 వేల వరకూ ఉంది.
యాక్సిస్ బ్యాంకు యూపీఐ చెల్లింపు పరిమితి రోజుకు 1 లక్ష రూపాయలు కాగా బ్యాంక్ ఆఫ్ బరోడ్ కూడా లక్ష రూపాయల వరకూ అనుమతిస్తుంది. 
కెనరా బ్యాంకు కూడా యూపీఐ చెల్లింపు రోజుకు 1 లక్ష రూపాయల వరకూ అనుమతిస్తుంది. అయితే కొత్తగా యాప్ వినియోగించేవారికి మాత్రం గరిష్ట అనుమతి ప్రారంభంలో ఉండదు. 

Also read: HDFC Bank Alert: హెచ్‌డి‌ఎఫ్‌సి కస్టమర్లకు హెచ్చరిక, మెస్సేజ్ లింక్‌లు క్లిక్ చేస్తే ఇంతే సంగతులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News