/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

HDFC Bank Alert: ఇంటర్నెట్ వినియోగం పెరగడం, డిజిటల్ లావాదేవీలు వేగవంతం కావడంతో ముప్పు కూడా అధికమౌతోంది. ఇంట్లోంచే బ్యాంకింగ్ లావాదేవీలు జరపడం సౌకర్యవంతంగా ఉన్నా అదే సమయంలో మోసాలకు ఆస్కారం కల్పిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లు ఎదుర్కొంటున్న మోసాలపై ఆ బ్యాంకు జాగ్రత్తలు సూచిస్తోంది.

ఇటీవలి కాలంలో అంతా మొబైల్ నుంచే జరుగుతోంది. ఫుడ్ ఆర్డర్ నుంచి మొదలుకుని ప్రతీది ఫోన్ సహాయంతోనే. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో పనులన్నీ పూర్తవుతున్నాయి. ఒక్క క్లిక్‌తో ఇంట్లో కూర్చునే చాలా వరకూ చెల్లింపులు కూడా జరుపుతున్న పరిస్థితి. అదే విధంగా ఒకే ఒక్క క్లిక్ మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ప్రత్యేకించి ఈ అలర్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు వర్తిస్తుంది. 

ఆధునిక పోటీ ప్రపంచంలో డిజిటల్ వినిమయం అధికమైంది. దీనికి తగ్గట్టుగానే మోసాలు చేసేవాళ్లు కూడా అడ్వాన్స్ అవుతున్నారు. ఇటీవల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్ల నుంచి దీనికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ బ్యాంకు కస్టమర్ల ఫోన్ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది. కేవైసీ, పాన్‌ అప్‌‌డేట్ చేయాలనేది ఆ మెస్సేజ్ సారాంశం. అదే మెస్సేజ్‌లో ఓ లింక్ ఇవ్వడం దానిపై క్లిక్ చేసి పాన్ కార్డు అప్‌డేట్ చేయాలని కోరడం జరుగుతుంది. మీరు ఏదో ధ్యాసలో ఉండి ఆ లింక్ క్లిక్ చేశారా..అంతే సంగతులు. మీ బ్యాంకు బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. 

మెస్సేజ్‌లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే ఆ హ్యాకర్‌కు మీ ఫోన్ యాక్సెస్ లభిస్తుంది. మీ ఫోన్ హ్యాకర్ చేతిలో కంట్రోల్ అవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు హోల్డర్లకు వచ్చే మెస్సేజ్ ఇలా ఉంటోంది సాధారణంగా.  "Dear customer your HDFC account will be hold today please update your KYC immediately click here".

సోషల్ మీడియాలో ఇదే విషయమై వచ్చిన ఫిర్యాదులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు స్పందించింది. బ్యాంకు నుంచి ఏ విధమైన మెస్సేజిలు పంపించలేదని తెలిపింది. ఎవరికైనా ఇలాంటి మెస్సేజ్‌లు వస్తే పొరపాటున కూడా వాటిని క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తోంది. ఈ విధమైన మోసానికి గురి కాకుండా ఉండాలంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. రెండవ వ్యక్తి ఎవరికీ మీ ఏటీఎం పిన్, సీవీవీ నెంబర్, ఎక్కౌంట్ వివరాలు ఇవ్వకూడదు. యూపీఐ పాస్‌వర్డ్‌‌ను ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండేట్టు చూసుకోవాలి. ఏదైనా మెస్సేజ్ మీకు ఫ్రాడ్‌గా అన్పిస్తే వెంటనే సంబంధిత బ్యాంకుకు ఫోన్ చేయాలి. బ్యాంకు ఎప్పుడూ కస్టమర్‌కు ఏ విధమైన మెస్సేజ్ ద్వారా సీవీవీ నెంబర్, పిన్, పాస్‌వర్డ్, ఓటీపీ వివరాలు కోరదనేది గుర్తుంచుకోవాలి.

Also read: EPFO: పీఎఫ్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. వడ్డీ రేటులో భారీ కోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Hdfc bank alert for its customers never click any message links nor share otp, atm pin details else your account will be zero
News Source: 
Home Title: 

HDFC Bank Alert: హెచ్‌డి‌ఎఫ్‌సి కస్టమర్లకు Alert, మెస్సేజ్ లింక్‌ క్లిక్ చేస్తే చాలు

HDFC Bank Alert: హెచ్‌డి‌ఎఫ్‌సి కస్టమర్లకు హెచ్చరిక, మెస్సేజ్ లింక్‌లు క్లిక్ చేస్తే ఇంతే సంగతులు
Caption: 
Hdfc alert ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
HDFC Bank Alert: హెచ్‌డి‌ఎఫ్‌సి కస్టమర్లకు Alert, మెస్సేజ్ లింక్‌ క్లిక్ చేస్తే చాలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, March 6, 2023 - 08:13
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
59
Is Breaking News: 
No