KA Paul: తెలంగాణ ఎమ్మెల్యే టికెట్‌ పేరిట కేఏ పాల్‌ భారీ మోసం.. బాధితుడు లబోదిబో

Cheating Case Filed Against KA Paul: తనదైన చేష్టలతో తెలుగు రాజకీయాల్లో హల్‌చల్‌ చేస్తున్న కేఏ పాల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే టికెట్‌ పేరిట మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 17, 2024, 08:04 PM IST
KA Paul: తెలంగాణ ఎమ్మెల్యే టికెట్‌ పేరిట కేఏ పాల్‌ భారీ మోసం.. బాధితుడు లబోదిబో

KA Paul Cheating: తెలుగు రాష్ట్రాల్లో తనదైన రాజకీయాలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చిక్కుల్లో పడ్డాడు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని తనకు భారీ మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని కేఏ పాల్‌ మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తెలంగాణలో కేఏ పాల్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది.

Also Read: Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్‌ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతానని ప్రకటించారు. ఆ క్రమంలో కొందరు పాల్‌ పార్టీపై పోటీ కూడా చేశారు. అయితే ఇదే ఎమ్మెల్యే టికెట్‌ ఒకరికి ఇప్పిస్తానని చెప్పి డబ్బులు దండుకున్నట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పాల్‌పై కేసు నమోదైంది.

Also Read: Mamata Banerjee: మరో బాంబ్‌ పేల్చిన మమతా బెనర్జీ.. ఇండియా కూటమికి రాం రాం

గతేడాది నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసేందుకు కొందరు ఆసక్తి కనబర్చారు. ఈ క్రమంలో ఎల్బీ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉనంచి కిరణ్‌ కుమార్‌ అనే వ్యక్తి పోటీపడ్డాడు. టికెట్ కోసం కిరణ్‌ కుమార్‌ పాల్‌ను కలిశాడు. ఎల్బీనగర్‌ టికెట్‌ ఇవ్వాలని అభ్యర్థించగా పాల్‌ రూ.50 లక్షలు డిమాండ్‌ చేశాడు. అయితే డబ్బులు చెల్లించినా కూడా తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుండా కేఏ పాల్‌ మోసం చేసినట్లు కిరణ్‌ కుమార్‌ వాపోయాడు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని కిరణ్‌ కుమార్‌ ఫిర్యాదు చేశాడు. 

ఎమ్మెల్యే టికెట్‌ పేరిట తనను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందజేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ఎల్బీ నగర్‌ అసెంబ్లీ టికెట్‌ కోసం కేఏ పాల్‌ రూ.50 లక్షలు అడిగాడు. టికెట్‌ కోసం నేను రూ.30 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశా. మిగిలిన రూ.20 లక్షలు విడతల వారీగా పాల్‌కు ఇచ్చాను. కానీ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుండా పాల్‌ మోసం చేశాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని కిరణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News