KA Paul Blasting On Rahul Gandhi And Revanth Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నాన్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ భూమి అమ్మకం ఆగకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చట్టపరంగా, రాజకీయపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ వివాదంపై విద్యార్థులు, అధ్యాపకులు, పలు రాజకీయ పార్టీల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
KA Paul Welcomes FIR Against On Cine Actors: బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేస్తున్న హీరో, హీరోయిన్లపై కేసులు నమోదు చేయడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హర్షం వ్యక్తం చేశారు. కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్‌లను సినీ ప్రముఖులు ప్రచారం చేయడాన్ని పాల్ తప్పుబట్టారు. వారి ప్రచారం కారణంగా అమాయకులు బలవుతున్నారని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను నమ్మి మోసపోకూడదని యువతకు కేఏ పాల్ సూచించారు.
KA Paul Fire On Pawan Kalyan: పవన్ కల్యాణ్ లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం చెప్పే పవన్ కల్యాణ్ మూడో పెళ్లి చేసుకోవచ్చా? అని ప్రశ్నించారు. తన ఆస్తులు కొట్టేసేందుకు చంద్రబాబు, పవన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
KA Paul Sensational Allegations On Chandrababu And Pawan Kalyan: తన ఆస్తులపై పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కన్నేశారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయంపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు.
KA Paul Fire On Narendra Modi A Head Of Indian Migrants Deportation: అక్రమ వలసదారులను పంపిస్తుండడంతో భారతదేశంలో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు.
Allu Arjun Arrest: ‘పుష్ప 2’ విడుదల సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో పోలీసులు అరెస్ట్ పర్వానికి తెర లేపారు. ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే సంధ్య థియేటర్ కు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ఈ అరెస్ట్ ను కొందరు స్వాగతిస్తూ ఉండగా.. మరికొందరు ఇది ప్రభుత్వ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు.
KA Paul Demands Pawan Kalyan Resign: సనాతన ధర్మం, తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిచ్చి రాజకీయాలపై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KA Paul Fires on Konda Surekha: మంత్రి కొండా సురేఖపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె 72 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున సమంత ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని కోరారు.
Cheating Case Filed Against KA Paul: తనదైన చేష్టలతో తెలుగు రాజకీయాల్లో హల్చల్ చేస్తున్న కేఏ పాల్‌కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే టికెట్ పేరిట మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
KA Paul Prajashanti Party Symbol: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. హెలికాప్టర్ గుర్తును కాకుండా 'మట్టికుండ'ను ప్రకటించింది. ఈ విషయాన్ని పాల్ స్వయంగా తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.