LPG Gas Cylinder Stole: దర్జాగా 'కారు'లో వచ్చి 'సిలిండర్‌' దొంగలించిన యువకులు

Gas Cylinder Theft:  వింత వింత దొంగతనం జరిగింది. రోడ్డుపై ఆపి ఉన్న ట్రాలీ ఆటోలో గ్యాస్‌ సిలిండర్‌లను ఇద్దరు యువకులు దొంగతనం చేశారు. అది కూడా దర్జాగా పెద్ద కారులో దొంగిలించడం వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 2, 2024, 05:23 PM IST
LPG Gas Cylinder Stole: దర్జాగా 'కారు'లో వచ్చి 'సిలిండర్‌' దొంగలించిన యువకులు

Cylinder Theft: దొంగలు రూట్‌ మారుస్తున్నారు. ఇన్నాళ్లు బంగారం, నగదును దొంగలించేవారు. ఇప్పుడు తమకు అవసరమైన వస్తువులను దొంగిలిస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు గ్యాస్‌ సిలిండర్‌ దొంగతనానికి పాల్పడ్డారు. అది కూడా కారులో దర్జాగా వచ్చి పట్టపగలు నిలిపి ఉన్న ఆటోలో దొంగతనం చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మీరేం దొంగలు రా నాయనా అని కామెంట్‌ చేస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

Also Read: Cyber Fraud: అమ్మాయి పేరుతో అబ్బాయి వేషాలు.. జూనియర్‌ ఆర్టిస్ట్‌ లీలలు మామూలుగా లేవు

హైదరాబాద్‌ మాదన్నపేటలోని భార్గవి గ్యాస్‌ ఏజెన్సీకి సంబంధించిన ట్రాలీ ఆటోలో గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తుంటారు. రీఫిల్‌ సిలిండర్లకు వినియోగదారులకు అందించేందుకు వెళ్లిన క్రమంలో ఈ దొంగతనం జరిగింది. రోడ్డు పక్కన ఆటో నిలిపి సిలిండర్‌ ఇచ్చేందుకు సైదాబాద్‌ ప్రధాన రోడ్డు పక్కన ఆపి వినియోగదారుడి ఇంటికి సిబ్బంది వెళ్లారు. గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి వచ్చాక యథావిధిగా మిగతావి పంపిణీ చేశారు. అయితే ఆఖరకు సిలిండర్లలో సంఖ్య తేడా వచ్చింది. ఆకటి కనిపించడం లేదని గమనించారు. సిలిండర్‌ దొంగతనం జరిగిందని గమనించి వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ సీసీ కెమెరాల్లో యువకులు సిలిండర్‌ ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసి అవాక్కయ్యారు.

Also Read: Momos: భార్యాభర్తల మధ్య 'మోమోస్‌' చిచ్చు.. విడాకులివ్వాలని కేసు పెట్టిన భార్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News