Tragic Incident: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారాలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు యమపాశాలవుతున్నాయి. బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే ఈ అప్పుల బెడద కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా కుమారుడు చేసిన బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు పొలాలు విక్రయించారు. అయినా కూడా అప్పు గుదిబండగా ఉండడంతో ఆ తల్లిదండ్రులు మస్తాపానికి గురయ్యారు. గ్రామంలో గౌరవంగా బతికినవాళ్లు కొడుకు చేసిన పనితో పరువు పోవడంతో ఆ దంపతులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: Mastan Sai Arrest: డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్.. అతడు ఎవరి కొడుకో తెలిస్తే షాకవుతారు
ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతికి ఓ కుమారుడు నిఖిలేశ్వర్ రెడ్డి ఉన్నాడు. అతడికి చిన్నప్పటి నుంచి బెట్టింగ్ అలవాటు ఉంది. జాతరలో కాయ్ రాజా కాయ్ వంటి బెట్టింగ్ ఆటలు ఆడుతుంటాడు. వాటికోసం అప్పులు చేస్తుంటాడు. జాతరలో ఆడిన బెట్టింగ్ వ్యవహారాలు ఆన్‌లైన్‌లోకి చేరాయి. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతూ భారీగా అప్పులు చేశాడు. దాదాపు రూ.5 కోట్లు దాకా అప్పులు చేసినట్లు సమాచారం. కొడుకు తీరు మారకపోవడం.. అప్పులు గుదిబండలాగా మారడంతో తల్లిదండ్రులు మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
Also Read: Massive Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీ విద్యార్థులు ఐదుగురు దుర్మరణం
కొడుకు చేసిన అప్పులను తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమకు ఉన్న 8 ఎకరాల్లో ఐదెకరాలను తాకట్టు పెట్టారు. దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పులు తీర్చారని గ్రామస్తులు చెప్పారు. ఇంకా అప్పులు తీర్చాల్సినవి భారీగా ఉండడంతో వారి శక్తికి మించినవిగా మారాయి. అప్పులు తీర్చే మార్గం లేక ఆ తల్లిదండ్రులు తనువు చాలించారు. 'మీ కుమారుడు అప్పు ఉన్నాడు' అని ప్రతిరోజు ఫోన్లు రావడం.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తట్టుకోలేకపోయారు. మిగిలిన మూడు ఎకరాలు విక్రయించినా అప్పులు తీర్చలేమనే భయంతో వారు ప్రాణాలు తీసుకున్నారు.
గ్రామంలోని తమ వ్యవసాయ పొలానికి మంగళవారం రాత్రి మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి చేరుకున్నారు. కొద్దిసేపటికి క్రిమి సంహారక మందు సేవించి ఇద్దరూ పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున సమీప పొలాల రైతులు వచ్చి చూసేసరికి వారిద్దరూ అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter