Baba Ramdev Controversial Comments: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని థానేలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ నోరు జారారు. మహిళలు ఏం ధరించకపోయినా అందంగా ఉంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వేదికపై బాబాతోపాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య, సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు.
శుక్రవారం థానేలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి బాబా రామ్‌దేవ్ హాజరయ్యారు. మహిళల కోసం ఈ యోగా సదస్సును ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలు యోగా దుస్తులు ధరించి రాగా.. కార్యక్రమం అనంతరం సాధారణ సమావేశానికి హాజరయ్యేందుకు చీరలను తీసుకొచ్చారు. ఉదయం యోగా సైన్స్ క్యాంపు నిర్వహించారు. అనంతరం మహిళలకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇది జరిగిన వెంటనే మహిళల సాధారణ సమావేశం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ.. "మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్‌లలో కూడా అందంగా కనిపిస్తారు. నాలాగా ఏమి ధరించకపోయినా అందంగా ఉంటారు.." అని అంటూ వివాదాస్పద రీతిలో కామెంట్స్ చేశారు. చీర కట్టుకోవడానికి సమయం లేకపోయినా పర్వాలేదని.. ఇంటికి వెళ్లి చీరకట్టుకోవాలని సూట్ ధరించిన మహిళలకు సూచించారు. ఇక ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణిని కొనియాడారు. ప్రజలు దీర్ఘాయుష్షు పొందాలంటే అమృత ఫడ్నవీస్ లాగా నవ్వుతూ సంతోషంగా ఉండాలంటూ చమత్కిరించారు.
(Baba Ramdev Controversial statement).महाराष्ट्र के ठाणे में रामदेव ने कहा 'साड़ी पहनने की फुर्सत नहीं थी, कोई बात नहीं, अब घर जाकर साड़ी पहनो, महिलाओं को साड़ी पहनना अच्छा लगता है. महिलाएं सलवार सूट में भी अच्छी लगती हैं और मेरी तरह बिना कुछ पहने भी अच्छी लगती हैं.' pic.twitter.com/0Sw0NJxjUT
— Garima Mehra Dasauni (@garimadasauni) November 25, 2022
రామ్‌దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సల్వార్, కుర్తా ధరించి వేదికపై నుంచి రామ్‌దేవ్ పారిపోయేందుకు ప్రయత్నించిన ఘటనను గుర్తు చేస్తున్నారు. 'రామ్‌దేవ్‌కు మొదటి నుంచి మహిళల దుస్తులంటే ఇష్టం. అందుకే ఆయన సల్వార్ కుర్తా ధరించి పారిపోయాడు..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: India Vs New Zealand: టీ20ల్లో సూపర్ హీరో.. మొదటి వన్డేలో విలన్‌గా మారాడు
Also Read: 7th Pay Commission Update: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా ఖాతాల్లో నగదు జమ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook