NTR Prashanth Neel Project : ఎన్టీఆర్ కోసం ఆమిర్ ఖాన్.. వర్కౌట్ అవుతుందా?

Aamir Khan In NTR Movie ఆమిర్ ఖాన్ సినిమాలు ఇప్పుడు ఇండియాలో ఆడటం లేదు. చివరగా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణాతి దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ సినిమా ఇంతలా ఫ్లాప్ అవుతుందని ఆమిర్ కూడా ఊహించలేదేమో.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 04:39 PM IST
  • ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్
  • ప్రశాంత్ నీల్ భారీ ప్లానింగ్ ఇదేనా?
  • ఎన్టీఆర్ సినిమాలో ఆమిర్ ఖాన్
NTR Prashanth Neel Project : ఎన్టీఆర్ కోసం ఆమిర్ ఖాన్.. వర్కౌట్ అవుతుందా?

Aamir Khan In NTR Movie ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇలా ఏ ఒక్క హీరో సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆడటం లేదు. ఒకప్పటి స్టార్ హీరోలంతా ఇప్పుడు ఢీలా పడిపోతోన్నారు. అసలు బాలీవుడ్‌ మొత్తం కుంటుపడిపోయింది. నార్త్ ఆడియెన్స్ కూడా బాలీవుడ్‌ను, అక్కడి స్టార్ హీరోలను తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా సౌత్ మేనియా నడుస్తోంది.

ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను ప్రశాంత్ నీల్ మొదలుపెట్టేశాడట. అసలే ఇప్పుడు బాలీవుడ్ హీరోలను సౌత్ సినిమాల్లో నటింపజేస్తున్నారు మేకర్లు. అలానే కేజీయఫ్ సినిమా కోసం సంజయ్ దత్‌ను తీసుకున్నాడు ప్రశాంత్ నీల్.

ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అసలే ఆమిర్ ఖాన్ అయితే లాల్ సింగ్ చడ్డా సినిమాతో ఘోర పరాభవాన్ని చవిచూశాడు. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ కూడా ఆమిర్ ఖాన్ ప్రారంభించలేదు. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వార్త అయితే బయటకు వచ్చింది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చేయబోతోన్న సినిమా కోసం ఆమిర్ ఖాన్‌ను తీసుకున్నారని, అందుకు ఆమిర్ కూడా తెగ సంతోషించాడని, ఎలాగైనా సౌత్‌లోనూ తన మార్కెట్ పెంచుకోవాలని, అందుకే ఇది మంచి అవకాశామని భావిస్తున్నాడట. మరి నిజంగానే ఈ రూమర్లు రియాల్టీలోకి వస్తాయా? ఎన్టీఆర్ సినిమాలో ఆమిర్ నటిస్తున్నాడా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News