Pratap Pothen died in Chennai: ఒకప్పటి తెలుగు హీరోయిన్ రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. చెన్నైలోని తన ఫ్లాట్లో ఆయన విగతజీవిగా కనిపించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన వయసు 69 సంవత్సరాలు. ఆయన చివరిగా మమ్ముట్టి హీరోగా రూపొందిన సిబిఐ 5 ది బ్రెయిన్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఆయన అనేక తమిళ, మలయాళ, తెలుగు సినిమాలలో నటించారు. ప్రతాప్ ఆగస్టు 13 1952 వ సంవత్సరంలో జన్మించారు.
ఊటీలోని లారెన్స్ స్కూల్ లో చదువుకున్న ఆయన ఆ తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన మొత్తం మీద మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 100 సినిమాల్లో నటించారు. అలాగే తన కెరియర్లో 12 సినిమాలుకు దర్శకత్వం వహించారు. ప్రతాప్ హీరోయిన్ రాధికను 1985వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.అయితే వివాహం చేసుకున్న ఏడాదిలోపే వారు విడాకులు తీసుకున్నారు. 86లో వారు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ఆయన అమల సత్యనాద్ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు.
వారిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఆమెతో కూడా 22 ఏళ్ళ వివాహ బంధం అనంతరం ప్రతాప్ విడాకులు తీసుకున్నారు. చివరిగా ఆయన బారోజ్ అనే మూవీ మలయాళం మూవీలో నటించారు. అది ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా ఆ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు. ఇక తెలుగులో ఆయన ఆకలి రాజ్యం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, చుక్కల్లో చంద్రుడు, మరోచరిత్ర, వీడెవడు వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే ఆయన నటుడు దర్శకుడుగా కంటే రాధిక మాజీ భర్తగానే ఎక్కువ గుర్తింపు పొందారు. ఇక ఆయన కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారని వెల్లడైంది.
Also Read: Kangana Ranaut Emergency: ఇందిరాగాంధీగా అదరకొట్టిన కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ టీజర్ చూశారా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.