Actor Suhas Fan Boy Moment with Mahesh: కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన సుహాస్ ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా థియేటర్ ట్రైలర్ శుక్రవారం నాడు రిలీజ్ అయింది. సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే లభించింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన మహేష్ బాబు సినిమా ట్రైలర్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు.
సినిమా నిర్మాతలు ఇద్దరినీ సోషల్ మీడియా వేదికగా టాగ్ చేసిన మహేష్ బాబు మీరు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని పేర్కొనమే కాక నటుడు సుహాస్ హీరోయిన్ టీనా శిల్ప రాజ్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నానంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇక మహేష్ బాబు ట్వీట్ చేయడంతో యాక్టర్ సుహాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు.
అప్పుడు పోకిరి టిక్కెట్ల కోసం విజయవాడ అలంకార్ థియేటర్ లో నా చొక్కా చిరిగిపోయింది, ఇప్పుడు ఈ ట్వీట్ చూసినా చొక్కా నేనే చింపుకునే అంత ఆనందం వచ్చింది, థాంక్యూ సో మచ్ సార్, హ్యాపీయెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక సుహాస్ హీరోగా టీనా శిల్ప రాజ్ హీరోయిన్ గా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సుహాస్ ఒక బుక్ రైటర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండటంతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. కలర్ ఫోటో సినిమాతో హీరోగా లాంచ్ అయిన సుహాస్ హిట్ 2 సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు.
Also Read: Raghu Kunche Emotional: ఆఖరి క్షణాల్లో కూడా అలానే వెళ్లిపోయారు.. తండ్రి మరణంపై రఘు కుంచె ఎమోషనల్
Also Read: Akhanda Hindi: 'పఠాన్'ను టార్గెట్ చేయడానికే అఖండను ఇప్పుడు రిలీజ్ చేశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook