Valimai postponed: మరో సినిమాపై కరోనా దెబ్బ- 'వాలీమై' విడుదల వాయిదా

Valimai postponed: కరోనా మహమ్మారి ప్రభావం మరో సినిమాపై పడింది. అజిత్​ హీరోగా నటించిన వాలీమై విడుదలను వాయిదా వేస్తూ చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 11:19 PM IST
  • సినిమాలపై కరోనా ప్రభావం
  • విడుదల వాయిదా వేస్తున్న బడా సినిమాలు
  • ఆర్​ఆర్​ఆర్​, రాదేశ్యామ్ బాటలో వాలీమై
Valimai postponed: మరో సినిమాపై కరోనా దెబ్బ- 'వాలీమై' విడుదల వాయిదా

Valimai postponed: దేశంలో కరోనా కేసుల పెరుగుదల ప్రభావం మరో భారీ సినిమాపై పడింది.

తమిళ స్టార్​ అజిత్​ హీరోగా నటించిన 'వలీమై' వాయిదా వేస్తూ చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్​ ట్విట్టర్​ ద్వారా ప్రకటించింది. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమాను జనవరి 13న థియేటర్లలో విడుదల (Valimai release date) చేయాలని భావించారు నిర్మాతలు.

సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని చెప్పింది చిత్ర నిర్మా సంస్థ జీ స్టూడియోస్​. అందరూ సురక్షితంగా ఉండాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు అండగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కృతజ్ఞతలు (Valimai update) తెలిపింది.

తెలుగు సహా వివిధ భాషల్లో ఇప్పటికే పలు సినిమాల విడుదల వాయిదా పడింది. 'ఆర్​ఆర్​ఆర్​' 'రాధేశ్యామ్​' వంటి సినిమాల విడుదలను వాయిదా వేశారు (Movies release postponed) నిర్మాతలు. భారీ బడ్జెట్ సినిమాలు అవడం, వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ ఆంక్షల కారణంగా థియేటర్లు మూసేస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

సంక్రాంతికి కొత్త సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలనుకున్న ఫ్యాన్స్, ప్రేక్షకుల​కు ఇది ఓ చేదు వార్త అనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.

వాలీమై సినిమా గురించి..

ఈ సినిమాలో అజిత్​ సరసన హ్యూమా ఖురేషీ హీరోయిన్​గా నటించారు. తెలుగు యువ హీరో కార్తికేయ విలన్​ పాత్ర పోషించారు.యువన్ శంకర్​ రాజా సంగీతమందించారు.

జీ స్టూడియోస్​ సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్​ ఈ చిత్రాన్ని (About Valimai Film) నిర్మించారు.

Also read: Mahesh Babu tested Corona Positive: మహేశ్​ బాబుకు కరోనా పాజిటివ్​- స్వయంగా వెల్లడి..

Also read: O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News