Breathe of Nandi: ఆసక్తిరేపుతున్న అల్లరి నరేష్ కొత్త సినిమా

Allari Naresh in Naandi: కామెడీ సినిమాలతో అందరిని కడుపుబ్బా నవ్వించే టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఈ సారి 'నాంది' అనే ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించనున్నాడు. శుక్రవారం సాయంత్రం గం. 5 లకు సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేశాడు. బ్రెత్ ఆఫ్ 'నాంది' ( Breathe of Naandi ) పేరిట విడుదలైన ఈ వీడియోను అల్లరి నరేష్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Last Updated : Nov 7, 2020, 06:18 AM IST
Breathe of Nandi: ఆసక్తిరేపుతున్న అల్లరి నరేష్ కొత్త సినిమా

Allari Naresh in Naandi: కామెడీ సినిమాలతో అందరిని కడుపుబ్బా నవ్వించే టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఈ సారి 'నాంది' అనే ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించనున్నాడు. శుక్రవారం సాయంత్రం గం. 5 లకు సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేశాడు. బ్రెత్ ఆఫ్ 'నాంది' ( Breathe of Naandi ) పేరిట విడుదలైన ఈ వీడియోను అల్లరి నరేష్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ విచారణ ఎదుర్కొంటున్న సూర్య ప్రకాష్ అనే ఖైదీ పాత్రను పోషిస్తున్నాడు.

"15 లక్షల మంది ప్రాణ త్యాగం చేసుకుంటే కానీ మన దేశానికి స్వాతంత్య్రం రాలేదు, పదమూడు వందల మందికి పైగా బలిదానం చేసుకుంటే కానీ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకుండా న్యాయం గెలుచుకున్న సందర్భాలు చరిత్రలోనే లేవు. నా ప్రాణం పోయినా పర్లేదు న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి" అంటూ అల్లరి నరేష్ వాయిస్ టీజర్‌లో వినొచ్చు. Also read : Samantha hosting Sam Jam: 'సామ్ జామ్' అంటున్న సమంత

టీజర్‌లో చూపించిన దాని ప్రకారం ఈ సినిమాలో అల్లరి నరేష్ ( Allari Naresh ) న్యాయం కోసం తీవ్రంగా పోరాడుతున్నాడని తెలుస్తోంది. కాని అసలు కథ మాత్రం సినిమాలోనే తెలియనుంది. ఈ  టీజర్‌లో అల్లరి నరేష్‌ను ఒక ఎత్తైన బల్లపై కట్టేసిన విధానం చూస్తుంటే చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఈ సినిమాని విజయ్ కనకమేడల ( Vijay Kanakamedala ) డైరెక్ట్ చేస్తుండగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న ( Satish Vegeshna ) నిర్మిస్తున్నాడు. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ ( Varalaxmi Sharat Kumar ) మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. Also read : Bigg Boss Telugu 4: ఎలిమినేషన్ ప్రమాదంలో ఎవరున్నారు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News