Allu Aravind Aha OTT: వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆయన తండ్రి అల్లు అరవింద్.. 2020లో ఆహా సంస్థను స్థాపించడం ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ లతోపాటు ప్రత్యేకమైన కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను కూడా ప్రసారం చేసే సాధనంగా ఆహా ప్లాట్ఫామ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2022లో తమిళ్ కంటెంట్ ని కూడా ఆహా ప్లాట్ ఫామ్ ప్రదర్శించడం ప్రారంభించింది. సినీ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న కుటుంబం కావడంతో అల్లు ఫ్యామిలీ రన్ చేస్తున్న ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఓటీటీ రంగంలో బాగా బలపడింది.
వెరైటీ కంటెంట్ ఉన్న టాక్ షోలను నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తున్న ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ఆహా. ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో చిన్న సంస్థలు తలపడడం మరింత కష్టంగా మారుతోంది. పోటీ తట్టుకోవడానికి కొత్త యూజర్ షిప్ కోసం ఇప్పటికే ఆహా సంస్థ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందట. వీటితో పాటుగా సినీ సెలబ్రిటీలతో పలు రకాల షోలు నిర్వహిస్తున్నారు. తెలుగు ఓటీటీ టాక్ షోలలో విపరీతమైన ఆదరణ పొందిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో వీటిలో ఒకటి. ఆహా లో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం కి ఎంతో క్రేజ్ ఉంది.
అయితే ఇవి మాత్రమే ఆహా యూజర్ షిప్ పెంచడానికి సరిపోతాయి అనుకుంటే మాత్రం పొరపాటే. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రతివారం మీరు ప్రచారం చేయగలిగితేనే ఇతర ఓటీటీ సంస్థలతో దీతుగా రన్ అవ్వగలుగుతుంది. కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు స్టోరీలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అంటే అధిక ధరలు పెట్టాల్సిందే. ఇంటర్నేషనల్ బ్రాండ్ లో ఉన్న ఓటీటీ సంస్థలు.. అలా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ తీసుకొస్తున్నాయి కాబట్టే అధిక మొత్తంలో సబ్స్క్రిప్షన్ ఫీజు తీసుకుంటున్న ప్రజలు ఇబ్బంది పడడం లేదు. అదే మన లోకల్ సంస్థల విషయానికి వచ్చేసరికి చిన్న మొత్తం కూడా కష్టంగా మారిపోతుంది. మరోపక్క ఈ ధరల తాకిడికి సబ్స్క్రైబర్స్ సంఖ్య పడిపోవడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఇటు రిస్కు తీసుకోలేక అటు ఉన్న వాటితో లాభాలు ఆర్జించలేక ఆహా యూజర్ షిప్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని టాక్. అందుకే యూజర్ షిప్ ను అమ్మడానికి నిర్ణయం తీసుకున్నారట. ఇదే విషయం పై ప్రస్తుతం సోనీ నెట్వర్క్, సన్ నెట్వర్క్ లాంటి మరికొన్ని దిగజ సంస్థలతో డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయని టాక్. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్న విషయం అధికారిక ప్రకటన విడుదలయ్యాకే తెలుస్తుంది..
Also Read: Dil Raju: పాలిటిక్స్ లోకి రాబోతున్న దిల్ రాజు.. నిజమెంత?
Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి