Allu Arjun: హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ ను నేడు అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. కిమ్స్ హాస్పిటల్ కు వచ్చే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాలపేట పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు వచ్చినా ముందస్తుగా సమాచారం ఇస్తే అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసులు తెలిపారు.
సందర్శన విషయాన్ని గోప్యంగా ఉంచాలని సూచించారు. ఇప్పటికే బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2 విషయానికొస్తే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 32 రోజుల్లో రూ. 1831 కోట్ల వసూల్లతో భారతీయ సినీ చరిత్రంలో రికార్డులను తిరగరాసింది పుష్ప 2. అంతేకాదు దాదాపు 7 యేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ లైఫ్ టైమ్ వసూళ్లను క్రాస్ చేసింది. అప్పట్లో మల్టీప్లెక్స్ లో రూ. 150 టికెట్ రేట్ తో సాధారణ టాకీస్ లలో రూ. 80 అత్యధిక టికెట్ రేట్స్ తో ఈ ఫీట్ సాధించినట్టు కొంత మంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనా ప్యాన్ ఇండియా లెవల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘బాహుబలి 2’ లైఫ్ టైమ్ వసూళ్లు రూ. 1810 కోట్ల కలెక్షన్ ను సినిమాను మరో తెలుగు సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో అత్యధిక వసూళ్లతో క్రాస్ చేయడం విశేషం. మొత్తంగా హిందీలో ఈ సినిమా మన దేశంలో రూ. 815 కోట్ల నెట్ వసూళ్లతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తూన్న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను క్రాస్ చేయడం విశేషం. మొత్తంగా హిందీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ను మించిన సక్సెస్ అందుకోవడంతో ఈ ఫీట్ సాధ్యమైంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.