Jabardasth Comedian Punch Prasad Health Condition: జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్లలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. అదేం విచిత్రమో తెలియదు కానీ ముందు నుంచి పంచ్ ప్రసాద్ కి తన జబ్బు వల్లే ఎక్కువ పాపులారిటీ లభించిందని చెప్పొచ్చు. ఆయనకు గతంలోనే రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆయన భార్య కూడా ఒక కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే పలు కారణాలతో ఆమె కిడ్నీ మ్యాచ్ అవ్వకపోవడంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరగలేదు.
కానీ ఎప్పటికప్పుడు పంచ్ ప్రసాద్ తన డయాలసిస్ అయితే చేయించుకుంటూ వస్తూ ఉంటాడు. గతంలో ఒకసారి సీరియస్ అయినప్పుడు నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న నేపథ్యంలో వారే ముందుండి నడిపిస్తూ కొన్ని లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి జబర్దస్త్ కుటుంబ సభ్యుల ద్వారా పంచ్ ప్రసాద్ కుటుంబానికి అందజేశారు.
అయితే ఆ తర్వాత పంచ్ ప్రసాద్ కోలుకున్నాడు. కొన్నాళ్లపాటు తన పని తాను చేసుకోగలిగాడు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఇక ఇప్పుడు ఆయనకు మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో సుమారు అయిదారు రోజుల నుంచి జబర్దస్త్ కమెడియన్లందరూ పంచి ప్రసాద్ కుటుంబానికి అండగా నిలవాలని కోరుతూ డబ్బులు తోచినంత సహాయం చేయమని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
ఇక తాజాగా ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ఒక నెటిజన్ ట్యాగ్ చేశారు. ఈ విషయం మీద స్పందించిన హరికృష్ణ.. ఇప్పటికే తన టీం పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో టచ్‌లోకి వెళ్లిందని వారితో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత వీలైనంత త్వరగా ఆయన అనారోగ్య సమస్యలు క్లియర్ చేసే ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో మంచి ప్రసాద్‌కి సర్జరీ జరిగి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
My team is following up with the family and guiding them in LOC application process. We will LOC under CMRF for renal transplantation as soon as we complete the documents verification.#YSJaganCares https://t.co/CAkeihv0VR
— Dr Hari Krishna (@HariKrishnaCMO) June 8, 2023
Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన
Also Read: Adipurush: ఆది పురుష్ మొదటి టార్గెట్ పఠానే! రికార్డులకు చాలవు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి