స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నెక్ట్స్ జనరేషన్ ఐ ఫోన్ 10, ఐ ఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ల విడుదలకు యాపిల్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదో వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని ప్రత్యేక ప్రీమియం ఐఫోన్లను యాపిల్ సంస్థ విడుదల చేసింది . యాపిల్ సీఈవో టిమ్ కుక్ మంగళవారం కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో నెక్ట్స్ జనరేషన్ ఐ ఫోన్లను ప్రదర్శించారు.
ఫీచర్స్ అదుర్స్ ...
ఐ ఫోన్ 10 ఫీచర్స్ మస్త్ గా ఉన్నాయ్...ఈ సరికొత్త ఐఫోన్ టెన్ స్మార్ట్‌ఫోన్ ఫేస్ డిటెక్షన్ అన్‌లాక్ సిస్టమ్‌తో వస్తోంది. అంటే యూజర్ ఫోన్‌ను తన ముఖానికి ఎదురుగా ఉంచుకుని, కళ్లతో చూడటం ద్వారా అన్‌లాక్ చేసుకోవచ్చు. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత.
ఐ ఫోన్ 10 ఫీచర్స్ :
* హై రిజొల్యూషన్ ఓలెడ్ ఎడ్జ్ టు ఎడ్జ్ కల్గిన 5.8 అంగుళాల డిస్ ప్లే
* కెమెరా: బ్యాక్ 12, ఫ్రంట్ 7 మెగా పిక్సల్
* ఫేస్ ఐడీ ; యూజర్ ఫేస్‌ను స్కాన్ చేసి అన్‌లాక్ చేసుకోవచ్చు
* 64 జీబి నుంచి 256 జీబి
* ఆల్ గ్లాస్ బాడీ
* వైర్ లెస్ చార్జింగ్
* బ్లూ టూత్ 5.0
* వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్
* క్వాడ్ ఎల్‌ఈడీ ట్రూన్ టోన్ ఫ్లాష్
* ధర రూ. 89,000 నుంచి ప్రారంభం
ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్‌కు కొనసాగింపుగా ఐఫోన్ 8, ఐఫోన్ 8ప్లస్ ఫోన్లను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ ఫోన్లు కూడా ఆల్ గ్లాస్ బాడీతో వస్తున్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
ఐ ఫోన్ 8 ప్లస్ ఫీచర్స్:
* 5.5 అంగుళాల డిస్ ప్లే
* ప్రీమియం గ్లాస్ ఫినిష్
* కెమెరా: బ్యాక్ 12, ఫ్లంట్ 8 మెగా పిక్సల్
* వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్
* 64 జీబీ స్టోరేజ్ నుంచి మెడల్స్ ప్రారంభం
* ధర రూ.73,000 నుంచి ప్రారంభం
ఐ ఫోన్ 8 ఫీచర్స్:
* 4.7 అంగుళాల డిస్ ప్లే
* ప్రీమియం గ్లాస్ ఫినిష్
* కెమెరా: బ్యాక్ 12, ఫ్లంట్ 8 మెగా పిక్సల్
* వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్
* 64జీబీ స్టోరేజ్ నుంచి మెడల్స్ ప్రారంభం
* ధర రూ. 64,000 నుంచి ప్రారంభం
ఐ ఫోన్ 10 స్మార్ట్ ఫోన్ నవంబర్ 3 నుంచి అందుబాటులోకి రానుంది. అక్డోబర్ 27 నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఐ ఫోన్ 8, 8 ప్లస్ సెప్టెంబర్ 15 నుంచి అర్డర్స్ చేసుకోవచ్చు సెప్టెంబర్ 29 నుంచి మార్కెట్ లోకి అందుబాటులో ఉండనుంది.