గెటప్ శ్రీను.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందాడు కమెడియన్ శ్రీనివాస్. సుడిగాలి సుదీర్ టీమ్‌లో స్కిట్లు చేసి తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అయితే సెలబ్రిటలు అనగానే కాస్త ప్రైవసీ సమస్యలు తలెత్తుతాయి. లేకపోతే వారి పేరుపై సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి దుష్ప్రచారం జరుగుతుంటుంది. ఈ క్రమంలో కమెడియన్ గెటప్ శ్రీను సైబర్ పోలీసులను ఆశ్రయించనున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
కొందరు తన పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారని, అందులో వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు తనకు రెండు అకౌంట్లు మాత్రమే ఉన్నాయని, బొడ్డుపల్లి శ్రీను, జబర్ధస్త్ శ్రీనివాస్ అని వాటి పేర్లు అని తెలిపాడు. బొడ్డుపల్లి శ్రీను అనేది వ్యక్తిగత అకౌంట్ అని, జబర్ధస్త్ శ్రీనివాస్ అనేది తన పేజీ అని వెల్లడించాడు. అయితే కొందరు వ్యక్తులు గెటప్ శ్రీను పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నారని, ఈ విషయాలు నమ్మవద్దని సూచించాడు. కేవలం తాను చెప్పిన ఖాతాల్లో వివరాలు, పోస్టులను మాత్రమే నమ్మాలన్నాడు. రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్
అయితే తన పేరుతో గెటప్ శ్రీను అని అకౌంట్ క్రియేట్ చేసిన వారిపై త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నానని చెప్పాడు. గెటప్ శ్రీను ఖాతాలో వచ్చే పోస్టులకు తనకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశాడు. నిజంగానే తన అభిప్రాయమని నమ్మే పరిస్థితి ఉంటుందని, ఈ క్రమంలోనే తాను ఫేక్ అకౌంట్లపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..