Pathaan Movie Controversy: పాకిస్థాన్ ఆల్బం నుంచి బాలీవుడ్ కాపీ కొట్టిందా ?

Besharam Rang Song Controversy: పఠాన్ మూవీలో బేషరం రంగ్ సాంగ్ సృష్టించిన వివాదం అలా సద్దుమణిగిందో లేదో తాజాగా ఈ పాటపై మరో వివాదం తెరపైకొచ్చింది. బేషరం రంగ్ సాంగ్ కంపోజిషన్ ను పాకిస్తాన్ లో 26 ఏళ్ల క్రితం వచ్చిన ఒక పాట నుంచి కాపీ చేశారనేది కొత్త వివాదం. 

Written by - Pavan | Last Updated : Jan 3, 2023, 06:53 PM IST
Pathaan Movie Controversy: పాకిస్థాన్ ఆల్బం నుంచి బాలీవుడ్ కాపీ కొట్టిందా ?

Besharam Rang Song Controversy: పఠాన్ మూవీలో బేషరం రంగ్ సాంగ్ ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో సినిమాలో ఈ పాటను మాత్రమే కాదు.. మొత్తం సినిమానే బ్యాన్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన పఠాన్ మూవీలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించారు. జీరో సినిమా విడుదల తరువాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తోన్న సినిమా ఇది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే నాలుగోసారి కలిసి నటిస్తున్న పఠాన్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

పఠాన్ మూవీలో బేషరం రంగ్ సాంగ్ సృష్టించిన వివాదం అలా సద్దుమణిగిందో లేదో తాజాగా ఈ పాటపై మరో వివాదం తెరపైకొచ్చింది. బేషరం రంగ్ సాంగ్ కంపోజిషన్ ను పాకిస్తాన్ లో 26 ఏళ్ల క్రితం వచ్చిన ఒక పాట నుంచి కాపీ చేశారనేది కొత్త వివాదం. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sajjad Ali Official (@thesajjadali)

 

పాకిస్థాన్ కి చెందిన సజ్జద్ అలీ అనే ఒక సింగర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఒక కొత్త సినిమా పాట వింటే తనకు 26 ఏళ్ల కిందట తను పాడిన పాటే గుర్తుచ్చిందంటూ ఆనాటి ఆ పాటను పాడి వినిపించాడు. ఆ పాటను విన్న నెటిజెన్స్.. ఈ పాట పఠాన్ మూవీలోని బేషరం సాంగ్ ని పోలి ఉందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. సజ్జద్ అలీ పఠాన్ మూవీపై నేరుగా కామెంట్స్ చేయనప్పటికీ.. అతడు పాడిన పాటకు, పఠాన్ మూవీలోని పాటకు కంపోజిషన్ సేమ్ ఉందంటూ నెటిజెన్స్ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News