Bhagavanth Kesari Songs: భగవంత్ కేసరి సెకండ్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Bhagavanth Kesari Movie: బాలయ్య భగవంత్ కేసరి నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. తండ్రీ కూతుళ్ల మధ్య సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సాంగ్ సాగుతోంది. ఇందులో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటిస్తోంది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 04:23 PM IST
Bhagavanth Kesari Songs: భగవంత్ కేసరి సెకండ్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Bhagavanth Kesari Second Song: నందమూరి బాలకృష్ణ-ఆనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్ కేసరి’. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  ‘ఉయ్యాలో ఉయ్యాలా’ అంటూ సాగే ఈ పాట తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతోంది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో టాలీవుడ్ యంగ్ సెన్షెషన్ శ్రీలీల నటించింది. ‘ఉయ్యాలో ఉయ్యాల’ పాటను సీనియర్ సింగర్ ఎస్‍పీ చరణ్ అలపించగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ధమన్ అందించిన బాణీలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ లో బాలకృష్ణ తన కూతురుని చిన్నప్పటి నుంచి ఎంత అపురూపుంగా పెంచారో చూపించారు. ఈ పాటను తెలంగాణ యాసలో రాశారు అనంత్ శ్రీరామ్.

ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, విలన్ గా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంఫాల్ నటించారు.  భగవంత్ కేసరి సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై  సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినట్లు రీసెంట్ గా మూవీటీమ్ పోస్ట్ చేసింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఆ దిశగా పనులను మెుదలు పెట్టింది. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ షురూ చేయనుంది మూవీటీమ్. అక్టోబరు 08న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News