Devara Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా 'దేవర'...

Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్-స్టార్ డైరక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న  చిత్రం 'దేవర'. తాజాగా తారక్ అభిమానులగు గుడ్ న్యూస్ చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశాడు దర్శకుడు కొరటాల శివ.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 12:40 PM IST
Devara Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా 'దేవర'...

Devara in Two Parts: 'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి స్టార్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ ను ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. విస్మరణకు గురైన తీరప్రాంత నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.  మ్యూజిక్ సెన్షెషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను  యువ సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.300 కోట్లతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

‘తాజాగా 'దేవర'’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ను ప్రకటించారు డైరెక్టర్ కొరటాల శివ. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు ఆయన బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనిని రెండు పార్టులుగా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

''ఎన్టీఆర్‌కు ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎక్సైట్‌ అయ్యారు. ఓ సరికొత్త ప్రపంచంలో అత్యంత బలమైన పాత్రలు, ఎమోషన్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. షూటింగ్‌ మెుదలుపెట్టినప్పటి నుంచి ప్రతీ ఎపిసోడ్‌ ఓ అద్భుతంలా అనిపించింది. ఇందులో ఒక్క సీన్, ఒక్క డైలాగ్ కూడా తీసేయలేం. అందుకే ఇంతటి బిగ్‌ కాన్వాస్‌ ఉన్న సినిమాను రెండు  భాగాలుగా తీస్తేనే బాగుంటుందనుకున్నాం. దాంతో మా టీమ్‌ అందరితో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నాం. ముందుగా ప్రకటించిన తేదీకే అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న పార్ట్ 1ను రిలీజ్ చేస్తాం'' అని కొరటాల అన్నారు.

Also Read: Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి వచ్చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News