Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్​కు పండగే...దసరా రోజున 'భీమ్లా నాయక్' సర్​ప్రైజ్..

Bheemla Nayak: పవన్ కళ్యాణ్-రానా కలిసి నటిస్తున్న చిత్రం'భీమ్లానాయక్​'. ఈ చిత్రం నుంచి దసరా సందర్భంగా మరో సర్ ప్రైజ్ రానుంది. అదేంటంటే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 07:55 PM IST
Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్​కు పండగే...దసరా రోజున 'భీమ్లా నాయక్' సర్​ప్రైజ్..

Bheemla Nayak: పవర్​స్టార్​-రానా అభిమానులకు మరోసారి ట్రీట్​ ఇచ్చేందుకు సిద్ధమైంది 'భీమ్లానాయక్​'(Bheemla Nayak) చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాలోని 'భీమ్లా నాయక్​' టైటిల్​ సాంగ్​ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడా చిత్రంలోని రెండో పాట(Bheemla Nayak Song Lyrics) 'అంత ఇష్టం'ను దసరా కానుకగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సాంగ్​కు సంబంధించిన పోస్టర్​ను విడుదల చేయగా.. అందులో పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​తో పాటు నిత్యా మేనన్(Nithya Menon) ఉన్నారు.

మల్టీస్టారర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'భీమ్లా నాయక్'​(Bheemla Nayak) పాత్రలో పవన్​.. డేనియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్, రానా​ పాత్రలకు సంబంధించిన గ్లింప్స్(Glimpse)ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. త్రివిక్రమ్(Trivikram) స్క్రీన్​ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న(Bheemla Nayak Release Date) సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. 

Also read: Prabhas 25th movie: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ మూవీ ?

ఇతర సినిమాల విషయానికొస్తే..
పవన్​.. ఈ చిత్రంతో పాటు 'హరిహర వీరమల్లు'(Harihara Veeramallu Story), 'భవదీయుడు భగత్ సింగ్'(Pawankalyan Harish Shankar Movie), సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో ఓ​ సినిమా నటిస్తున్నారు. ఇక రానా(Rana).. త్వరలోనే 'విరాట పర్వం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News