Bhimla Nayak: భీమ్లా నాయక్ సెన్సార్​ పూర్తి- 25న మూవీ రిలీజ్​!

Bhimla Nayak: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్​ సినిమా నుంచి మరో అప్​డేట్ వచ్చింది. సినిమాకు తాజాగా సెన్సార్​ పూర్తయింది. 25న మూవీ రిలీజ్ అవనుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 08:13 PM IST
  • భీమ్లా నాయక్​కు యూ/ఏ సర్టిఫికెట్​
  • ఈ నెల 25 థియేటర్లలో విడుదల
  • శనివారం ట్రైలర్​ రిలీజ్​కు అవకాశం
Bhimla Nayak: భీమ్లా నాయక్ సెన్సార్​ పూర్తి- 25న మూవీ రిలీజ్​!

Bheemla Nayak: పవర్​స్టార్​ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న భీమ్లానాయక్​ సినిమాన నుంచి మరో బిగ్ అప్​డేట్​ వచ్చింది. సినిమాకు సెన్సార్​ పార్తయినట్లు వెల్లడించింది. సెన్సార్​ బోర్డు యూ బై ఏ సర్టిఫికేట్​ జారీ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితారా ఎంటర్​టైన్మెంట్స్​ వెల్లడించింది.

ఇక భీమ్లా నాయక్ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

విడుదల తేదీని ప్రకటించినప్పటికీ.. ట్రైలర్​ను మాత్రం విడుదల చేయలేదు. దీనిపై నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ తాజాగా స్పందిస్తూ.. ట్రైలర్​ త్వరలోనే రానున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం రేపే అంటే ఫిబ్రవరి 19నే భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశముంది.

భీమ్లా నాయక్ మూవీ​ గురించి..

ఈ సినిమాలో ఇద్దరు కథా నాయికలకు ఉన్నారు. నిత్యా మీనన్​, సంయుక్తా మీనన్​లు హీరోయిన్లుగా నటించారు.

సాగర్​ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ డైలాగ్స్ అందించారు. స్రీన్​ప్లే కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే అందించారు. ఎస్​.తమన్​ సంగీతమందించారు.

ఇది మలయాళంలో సూపర్ హిట్​గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియన్​కు రీమేక్​ కావడం గమనార్హం. రీమేక్ అయినప్పటికీ.. పవన్  కల్యాణ్​, రానా వంటి స్టార్స్​ నటిస్తుండటంతో తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాను సితార ఎంటర్​టైన్మెంట్స్​, హారిక & హాసిని క్రియేషన్స్​ బ్యానర్లపై నిర్మించారు. నాగవంశి, ఎస్​.రాధా కృష్ణ నిర్మాతలు.

Also read: Anasuya Bharadwaj: హలో.. నా వయసు 40 కాదు 36 మాత్రమే! జర్నలిస్ట్‌పై అనసూయ ఫైర్!!

Also read: Ram Pothineni, Boyapati Srinu : ఇస్మార్ట్ శంకర్‌తో బోయపాటి సినిమా.. టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News