Chiranjeevi Returns Bhola Shankar Movie Pay Cheque ?: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళాశంకర్ మూవీ గురించి ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్ పై ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చినప్పటికీ ఆ రూమర్స్ కి ఇంకా తెరపడటం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు ప్రచారం జరగ్గా... బాక్సాఫీస్ రన్ మాత్రం రూ. 40 కోట్ల వద్దే సరిపెట్టుకుందని.. ఫలితంగా నిర్మాత అనిల్ సుంకర ఘోరంగా నష్టాలు చవిచూశాడని సోషల్ మీడియాలో ఒక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది.
భోళా శంకర్ మూవీ కలెక్షన్స్ కొంతే అయితే.. నిర్మాతకు ఈ సినిమా మిగిల్చిన నష్టాలే ఎక్కువని.. అలాగే చిరు నిర్మాత వద్ద ముక్కు పిండీ మరీ పారితోషికం వసూలు చేశారని అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న విశ్లేషణలపై ఇటీవలే నిర్మాత అనిల్ సుంకర ట్విటర్ ద్వారా స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న అనిల్ సుంకర.. అదంతా కొంతమంది ఫేక్ న్యూస్ రాయుళ్లు తమ ఆనందం కోసం అల్లుతున్న కట్టుకథలే అనే తేల్చిచెప్పేశారు.
అనిల్ సుంకర్ ఇచ్చిన వివరణతో ఇక భోళా శంకర్ మూవీపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఇక తెరపడుతుంది అనే అంతా భావించారు. కానీ అలా జరగడం లేదు. మొన్నటిదాకా అనిల్ సుంకర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని.. మెహర్ రమేష్ పుణ్యమా అని భోళా శంకర్ మూవీ మిగిల్చిన నష్టాలతో తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది అని ప్రచారం జరిగితే.. తాజాగా ఈ సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి నిర్మాత అనిల్ సుంకరకు రూ. 10 కోట్ల చెక్ వాపసు ఇచ్చారంటూ ప్రచారం ఊపందుకుంది.
చిరంజీవి భోళా శంకర్ సినిమా కోసం దాదాపు రూ. 55 కోట్ల భారీ పారితోషికం తీసుకుని అనిల్ సుంకరకు అన్యాయం చేశారని జరుగుతున్న ప్రచారం చూసి ఆవేదనకు గురైన చిరంజీవి.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు నిర్మాతకు రూ. 10 కోట్లు తిరిగి ఇచ్చేశారనేది ఆ టాక్ సారాంశం. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని మెగా ఫ్యాన్స్ తిప్పికొడుతూ మెగా హీరోకు అండగా నిలుస్తున్నప్పటికీ.. ఇంకొంతమంది నెటిజెన్స్ మాత్రం ఈ రూమర్స్‌ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Baby OTT Release Date: బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ నెల 11న విడుదలైన భోళా శంకర్ మూవీలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, శ్రీముఖి, రష్మి, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్ట్ 25న భోళా శంకర్ మూవీ హిందీ వెర్షన్ విడుదల అవుతోంది. హిందీలో ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ చిరంజీవికి డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. తమిళంలో అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తళా అజిత్ హీరోగా వచ్చిన వెదాళం మూవీని తెలుగులో భోళా శంకర్ పేరుతో మెహర్ రమేష్ డైరెక్ట్ చేసి రీమేక్ చేశాడు. తమిళంలో ఈ సినిమాను శివ డైరెక్ట్ చేశాడు. 2015 లో రిలీజైన ఈ సినిమా తమిళంలో మొత్తం రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ. 100 కోట్ల క్లబ్‌లోనూ చోటు దక్కించుకుంది. కానీ తెలుగులో భోళా శంకర్ మూవీ ఫలితం మాత్రం రివర్ అవడం గమనార్హం. ఇది కూడా చదవండి : Criminal Or Devil: క్రిమినల్ ఆర్ డెవిల్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న అదా శర్మ లుక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి