Bigg Boss 6 Telugu 11th Week Nomination : నామినేషన్ లిస్ట్.. ఈసారి ఇంట్లోంచి బయటకు వెళ్లేది ఎవరంటే?

Bigg Boss 6 Telugu 11th Week Nomination బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం నామినేషన్లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఇంట్లో ఉన్న కెప్టెన్ ఫైమా తప్పా మిగిలిన అంతా కూడా నామినేట్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 04:55 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం సందడి
  • నామినేషన్ హీట్‌లపై ప్రోమోలు వైరల్
  • ఆ ముగ్గురు డేంజర్ జోన్‌లోనా?
Bigg Boss 6 Telugu 11th Week Nomination : నామినేషన్ లిస్ట్.. ఈసారి ఇంట్లోంచి బయటకు వెళ్లేది ఎవరంటే?

Bigg Boss 6 Telugu 11th Week Nomination : బిగ్ బాస్ ఇంట్లో పది వారాలు గడిచాయి. రానున్న ఐదు వారాలు ఎంతో ముఖ్యమైనవి. ఇక వారానికి ఒకరు చొప్పున బయటకు వెళ్తుంటారు. ఇప్పటికే పదకొండు మంది కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. అభినయ, షానీ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి ఇలా పదకొండు మంది కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. పదోవారంలో ఎవ్వరూ ఊహించనట్టుగా డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. అందులోనూ బాలాదిత్య ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక ఈ పదకొండో వారంలో నామినేషన్ లిస్ట్ బయటకు వచ్చింది. ఇంట్లో ఉన్నదే పది మంది కంటెస్టెంట్లు. మీరే టాప్ 10 అని,ఈ సారి విన్నింగ్ అమౌంట్ యాభై లక్షలు మీలో ఒకరికి వస్తాయ్.. అని ఇలా మోటివేట్ చేశాడు నాగార్జున. ఈ పదకొండో వారంలో నామినేషన్ ప్రక్రియ మళ్లీ ఇనయను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇలా ప్రతీ వారం ఇనయను టార్గెట్ చేస్తూ ఆమెను స్ట్రాంగ్ చేస్తున్నారు. అలా చేయడం వల్లే ఆమె మీద జనాలకు సింపతీ ఎక్కువ అవుతోంది.

శ్రీ సత్య, ఫైమా, శ్రీహాన్ ఇలా కావాలనే ఆమెను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఆదిరెడ్డి సైతం ఇనయను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. దీంతో ఇనయకు ఫుల్ క్రేజ్ పెరుగుతోంది. ఓట్లు పడుతున్నాయి. శ్రీ సత్య ప్రస్తుతం ఫుల్ నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అర్జున్‌ని అయితే చేయి పట్టుకుంటే వద్దనేది, చిరాకు పడేది.. పురుగును చూసినట్టుగా చూసేది. కానీ శ్రీహాన్‌తో అయితే హగ్గుల మీద హగ్గులు, టచింగ్స్ జరుగుతున్నాయి. దీంతో సత్య, శ్రీహాన్‌ల మీద నెగెటివ్ ఏర్పడింది.

రోహిత్, మెరినా, కీర్తిలు కూడా కాస్త డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. శ్రీహాన్, సత్యలతో పాటుగా రోహిత్,మెరినా, కీర్తిల్లోంచి ఎవరో ఒకరు మాత్రం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్టుగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో.. ఎవరు ఎలా ఆట ఆడుతారో చూడాలి.

Also Read : Childrens Day 2023 : ఈ క్యూట్ ఫోటోల్లో ఉన్న హీరోయిన్లు ఎవరు?..బుల్లితెరపై చెలరేగే బుల్లి భామలు ఎవరంటే?

Also Read : Samantha Naga Chaitanya : ఆ విషయంలో సమంత ముందు నిలబడని నాగ చైతన్య.. ఇది మామూలు రేంజ్ కాదు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News