Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌ కంటెస్టంట్స్‌లో కట్టప్ప ఎవరో చెప్పిన నాగ్

Who is Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో కట్టప్ప ఎవరో ఇవాళ తేల్చేద్దాం అంటూ కింగ్ నాగార్జున బిగ్ బాస్ వీకెండ్ ఎంటెర్టైంమెంట్‌ని డబుల్ చేయబోతున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో కట్టప్ప ఎవరు, పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేదెవరు అని హౌజ్‌మేట్స్ అందరు ఒకరి మీద ఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు.

Last Updated : Sep 12, 2020, 08:50 PM IST
  • బిగ్ బాస్ హౌజ్‌లో ఇంటి సభ్యులను వేధిస్తున్న మిలియన్ డాలర్స్ క్వశ్చన్.. కట్టప్ప ఎవరు ?
  • కట్టప్ప ఎవరో తెలుసుకునేందుకు ఇప్పటికే మూడుసార్లు టాస్కులు ఇచ్చిన బిగ్ బాస్.
  • వీకెండ్ షోలో కట్టప్ప ఎవరో నేనే సమాధానం చెబుతానంటున్న బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున.
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌ కంటెస్టంట్స్‌లో కట్టప్ప ఎవరో చెప్పిన నాగ్

Who is Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ సీజన్ 4 షోలో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లో కట్టప్ప ఎవరో ఇవాళ తేల్చేద్దాం అంటూ కింగ్ నాగార్జున బిగ్ బాస్ వీకెండ్ ఎంటెర్టైంమెంట్‌ని డబుల్ చేయబోతున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో కట్టప్ప ఎవరు, పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేదెవరు అని హౌజ్‌మేట్స్ అందరు ఒకరి మీద ఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. కట్టప్ప ఎవరు అని తెలుసుకోవడానికి ఇప్పటికే బిగ్ బాస్ మూడుసార్లు అవకాశం ఇచ్చాడు. అయినా సరే కట్టప్ప ఎవరో తెలియలేదు. Also read : Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో వీళ్లలో కట్టప్ప ఎవరు ?

5వ రోజు జరిగిన ఎపిసోడ్‌లో కట్టప్ప ఎవరు అనే టాస్క్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను ( Bigg Boss 4 Telugu contestants ) కట్టప్ప ఎవరని అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి వారి మొహం మీద కట్టప్ప అనే స్టాంప్ వేయమని బిగ్ బాస్ ఆదేశించగా.. వాళ్లు సింగర్ నోయల్ ( Singer Noel Sean ), యాంకర్ లాస్య ( Anchor Lasya ), డైరెక్టర్ సూర్య కిరణ్ ( Director Suryakiran ), అఖిల్, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్‌ల ( Amma Rajasekhar ) ముఖాల మీద కట్టప్ప స్టాంప్ వేశారు. కానీ నోయల్ వంతు వచ్చేటప్పటికి అతడు మాత్రం తాను కట్టప్పగా ఎవరో ఒకరి పేరు చెప్పి వాళ్లను బాధపెట్టడం తనకిష్టం లేదని చెప్పేశాడు. అందుకే తనకు తానే కట్టప్ప అనుకుంటా అంటూ తనకు తానే కట్టప్ప స్టాంప్ వేసుకున్నాడు. ఐతే అందుకు బిగ్ బాస్ అంగీకరించకపోవడంతో.. అప్పుడు నోయల్ వెళ్లి అమ్మ రాజశేఖర్‌కి స్టాంప్ వేసేశాడు. Also read : Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే

ఈ ప్రక్రియ ముగిసిన తరువాత కట్టప్ప ఎవరనేది నేను చెప్పను త్వరలోనే తెలుస్తుంది అని బిగ్ బాస్ అనగా ఇంకా ఎన్ని రోజులు బిగ్ బాస్ కట్టప్ప ఎవరో అని తెలిసేది అని యాంకర్ లాస్య అసహనం వ్యక్తం చేసింది. కట్టప్ప ఎవరు అనేది బిగ్ బాస్ మాటల్లో కాకుండా కింగ్ నాగార్జున ( Nagarjuna Akkineni ) మాటల్లో తెలపడానికి వీకెండ్ స్పెషల్‌లో నాగ్ రాబోతున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ 4వ సీజన్‌లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్‌‌లో ( Bigg Boss 4 Telugu first week eliminations ) భాగంగా ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసేది కూడా ఈ వీకెండ్‌లోనే. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News