Ambati Rayudu in CSK సురేష్ రైనా స్థానంలో అంబటి రాయుడు

Ambati Rayudu in IPL 2020: ఐపిఎల్ 2020కి మరెంతో దూరంలో లేదు. ఇంకో వారం రోజుల్లోనే ఆ బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. 13వ ఐపీఎల్ సీజన్‌లో పాల్గొనేందుకు అన్ని జట్లు సిద్ధం అవుతున్నప్పటికీ... చెన్నై సూపర్ కింగ్స్‌ ( Chennai Super Kings ) మాత్రం సురేష్ రైనా, హర్బజన్ సింగ్ ( Suresh Raina, Harbhajan Singh ) రూపంలో తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఇంకా తేరుకున్నట్టు కనిపించడం లేదు.

Last Updated : Sep 12, 2020, 06:26 PM IST
Ambati Rayudu in CSK సురేష్ రైనా స్థానంలో అంబటి రాయుడు

Ambati Rayudu in IPL 2020: ఐపిఎల్ 2020కి మరెంతో దూరంలో లేదు. ఇంకో వారం రోజుల్లోనే ఆ బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. 13వ ఐపీఎల్ సీజన్‌లో పాల్గొనేందుకు అన్ని జట్లు సిద్ధం అవుతున్నప్పటికీ... చెన్నై సూపర్ కింగ్స్‌ ( Chennai Super Kings ) మాత్రం సురేష్ రైనా, హర్బజన్ సింగ్ ( Suresh Raina, Harbhajan Singh ) రూపంలో తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఇంకా తేరుకున్నట్టు కనిపించడం లేదు. Also read : Kangana Ranaut's Y-plus security: కంగనాకు అందుకే వై-ప్లస్ సెక్యురిటీ: కేంద్ర మంత్రి

సురేష్ రైనా స్థానాన్ని భర్తీ చేయడం కోసం అందుకు సరిపోయే ఆటగాడిని అన్వేషించే పనిలో బిజీగా ఉన్న కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ( Mahendra Singh Dhoni ) తెలుగు తేజం అంబటి రాయుడు ( Ambati Rayudu ) అయితే సరిగ్గా సూట్ అవుతాడని న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టయిరిస్‌ ( Scott Styris ) సూచించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రసారమైన క్రికెట్ కనెక్టెడ్ అనే షోలో స్కాట్ స్టయిరిస్ పాల్గొని మాట్లాడుతూ రాయుడు విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. Also read : Revanth Reddy in PCC chief race: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఖాయమేనా ?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మూడో స్థానంలో ఆడించడానికి రుతురాజ్‌ని ( Ruturaj ) కానీ లేదా రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ) లాంటి హిట్టర్స్‌ని ఆడించేందుకు స్కోప్ ఉంది. కానీ జట్టులో 3వ స్థానానికి అంబటి రాయుడు అయితేనే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని స్కాట్ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అంబటి రాయుడే ఆ స్థానానికి సరిగ్గా సూట్ అవుతాడని భావిస్తున్నట్టు స్కాట్ పేర్కొన్నాడు. ఇక గత వారమే మూడో రౌండ్ కరోనా టెస్టులను ( COVID-19 tests ) ముగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK ) ఆ తర్వాతే మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. Also read : NTA JEE main result 2020: జేఈఈ ఫలితాలు విడుదల.. తెలంగాణ సత్తా చాటిన టాపర్స్ వీళ్లే

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News