Prabhas: కల్కి సినిమా హీరో ఒక జోకర్.. బాలీవుడ్ నటుడు చేసిన షాకింగ్ కామెంట్స్

Prabhas in Kalki: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సినిమాలో ప్రభాస్ పాత్ర లేదు అని.. ప్రభాస్ ఒక జోకర్ లా ఉన్నారు అని చేసిన కామెంట్స్.‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అర్షద్ మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 19, 2024, 03:46 PM IST
Prabhas: కల్కి సినిమా హీరో ఒక జోకర్.. బాలీవుడ్ నటుడు చేసిన షాకింగ్ కామెంట్స్

Arshad Warsi comments on Prabhas: యంగ్ రెబల్ సార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా కల్కి 2898 AD. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా తనకి నచ్చలేదని చెప్పిన అర్షద్ "సినిమాలో ప్రభాస్ ఒక జోకర్ లా ఉన్నారు" అని అన్నారు. 

"ప్రభాస్ ని ఒక మ్యాడ్ మ్యాక్స్ హీరో లాగా చూడాలి కానీ కల్కిలో ప్రభాస్ జోకర్ లా ఉన్నారు. అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్థం కాదు" అని చెప్పుకొచ్చారు అర్షద్ వార్సీ. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు అర్షద్ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకునే ఒక నటుడు గ్లోబల్ స్టార్ ఐన ప్రభాస్ గురించి ఇలా మాట్లాడటం ఏమాత్రం బాగోలేదు అని.. సినిమాలో ప్రభాస్ పాత్ర ఫస్టాఫ్ లో ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇచ్చిన ఎలివేషన్ మరి హీరోకి సెట్ కూడా అవ్వదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రభాస్ పాత్ర ఎలా ఉన్న సినిమాకి వచ్చిన ప్రేక్షకులలో 95% మంది ప్రభాస్ ని వెండి ధర మీద చెప్పడానికి మాత్రమే వచ్చారు అని.. బాలీవుడ్ లో ఉన్న ఎందరో స్టార్ డైరెక్టర్లు కూడా అమితాబచ్చని చూపించలేనటువంటి అద్భుతమైన విధంగా ఒక తెలుగు డైరెక్టర్ చూపించారు అని.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

సినిమా నచ్చకపోవడంలో తప్పులేదు కానీ దానిని చెప్పే విధానం బాగోలేదని.. ప్రభాస్ మీద గౌరవం లేకుండా ఇలాంటి చెత్త కామెంట్లు చేయడం అసలు బాగోలేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అర్షద్ వార్సీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more: Mohanlal:  ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మలయాళ స్టార్ హీరో.. టెన్షన్ లో ఫ్యాన్స్... అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News