Bodyguards' Salary: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ల బాడీగార్డుల్లో ఎవరికి ఎక్కువ జీతమో తెలుసా ?

Bollywood Actors' Bodyguards Remunerations: సినిమాలో భారీ భారీ స్టంట్స్ చేసి విలన్ల పంబరేగొట్టే స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ భారీ పారితోషికం తీసుకుంటున్నప్పుడు... వారికి సెక్యురిటీ అందించే పర్సనల్ బాడీగార్డులకు ఇంకెంత జీతం ఉండాలి మరి అనేది చాలామంది సందేహం. ఆ డీటేల్స్ చెబుతూ చేసిందే ఈ స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరే ఒక లుక్కేయండి.

Written by - Pavan | Last Updated : Jun 11, 2023, 03:26 AM IST
Bodyguards' Salary: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ల బాడీగార్డుల్లో ఎవరికి ఎక్కువ జీతమో తెలుసా ?

Bollywood Actors' Bodyguards Remunerations: సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్స్ అయినా వాళ్ల బలం అంతా కెమెరా ముందు మాత్రమేనని.. జనం మధ్యలోకి వస్తే వారికే మరొకరు భద్రత కల్పించాల్సి వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అభిమానులు ఆటోగ్రాఫ్స్ అంటూ, ఫోటోగ్రాఫ్స్ అంటూ మీద పడి వెంటపడుతుంటే.. వారి నుంచి బయటపడి తప్పించుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్లాలంటే వారికి కూడా మళ్లీ బాడీగార్డ్స్ కావాల్సిందే. మరి సినిమాలో భారీ భారీ స్టంట్స్ చేసి విలన్ల పంబరేగొట్టే స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ భారీ పారితోషికం తీసుకుంటున్నప్పుడు... వారికి సెక్యురిటీ అందించే పర్సనల్ బాడీగార్డులకు ఇంకెంత జీతం ఉండాలి మరి అనేది చాలామంది సందేహం. ఆ డీటేల్స్ చెబుతూ చేసిందే ఈ స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరే ఒక లుక్కేయండి.

సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు జనం మధ్యలోకి వస్తే వారికి సెక్యురిటీ కల్పించడం ఎంత కష్టమో వారికి సెక్యురిటీ అందించే వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో, హీరోయిన్స్‌కి సెక్యురిటీ కల్పించడం మరింత కష్టం అనే సంగతి తెలిసిందే. అందుకే ఆ స్టార్ సెలబ్రిటీలకు రక్షణ అందించే బాడీగార్డులు కూడా అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా సెక్యురిటీ ఇస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాడీగార్డులలో షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్ అందరికంటే ముందుంటాడు. రవి సింగ్ కి షారుఖ్ ఖాన్ ఏడాదికి సుమారు రూ. 2.7 కోట్లు చెల్లిస్తున్నాడు.

షారుఖ్ ఖాన్ పర్సనల్ బాడీగార్డ్ తరువాత సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా అతడికి కేవలం బాడీగార్డ్ మాత్రమే కాదు.. మంచి స్నేహితుడి టైప్ కూడా. షేరాకు సల్మాన్ ఖాన్ సంవత్సరానికి రూ. 2 కోట్లు వేతనం చెల్లిస్తున్నాడు. 2011లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బాడీగార్డ్ సినిమాలో టైటిల్ ట్రాక్‌లోనూ షేరా కనిపించడం చూసే ఉంటారు.

ఇక ఇప్పుడు అందరికంటే ముందుగా బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీగార్డు జితేంద్ర షిండే గురించి తెలుసుకుందాం. మీడియా కథనాల ప్రకారం చాలా కాలంగా అమితాబ్ బచ్చన్‌కి బాడీగార్డుగా డ్యూటీ చేస్తోన్న జితేంద్ర షిండే ఏడాదికి రూ. 1.5 కోట్లు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడు. 

అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ వార్షిక వేతనం రూ. 2 కోట్లు. అలాగే అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్ కి రూ. 1.2 కోట్లు వేతనం అందిస్తున్నాడు. సినిమా హీరోలు ఎలాంటి షెడ్యూల్ లేకుండా ఖాళీగా ఉండి, అదే సమయంలో వాళ్ల కుటుంబసభ్యులు బయటికి వెళ్లినట్టయితే.. ఆ సమయంలో వారికి బాడీగార్డులే ఎస్కార్టుగా వెళ్తుంటారు.

స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తన బాడీగార్డు జలాల్‌కు 1.2 కోట్ల రెమ్యునరేషన్ చెల్లిస్తోంది. జలాల్ చాలా ఏళ్లుగా ఆమె వద్ద బాడీగార్డుగా పనిచేస్తున్నాడు.

విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులకు ప్రకాశ్ సింగ్ సోను బాడీగార్డుగా సేవలు అందిస్తున్నాడు. ప్రకాష్ సింగ్ చాలా కాలంగా అనుష్క శర్మకు బాడీగార్డుగా ఉన్నాడు. అయితే, అనుష్కా శర్మ పెళ్లికి ముందు ఆమెకు మాత్రమే పర్సనల్ బాడీగార్డ్ అయిన ప్రకాశ్ సింగ్.. ఆ తర్వాతి నుంచి సమయం, సందర్భాన్నిబట్టి ఇద్దరికీ రక్షణ అందిస్తున్నాడు. జూమ్ టీవీ వార్తా కథనం ప్రకారం అనుష్కా శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు ( Virat Kohli, Anushka Sharma ) తమ బాడీగార్డ్ ప్రకాశ్ సింగ్‌కి ఏడాదికి రూ.1.2 కోట్లు రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారు.

Trending News