Deepika-Ranveer Singh Divorce: బాలీవుడ్ క్యూట్ కపుల్‌గా చెప్పుకున్న రణ్వీర్ సింగ్ - దీపికా పదుకోన్‌ల బంధం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారనేది బీటౌన్‌లో విన్పిస్తున్న మాట ఇప్పుడు.
బాలీవుడ్లో హాట్ అండ్ క్యూట్ కపుల్‌గా దీపికా పదుకోన్-రణ్వీర్ సింగ్‌లకు పేరుంది. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ 2018లో ఒక్కటయ్యారు. ఇక అప్పట్నించి ఎక్కడ చూసినా..ఈవెంట్, అవార్డ్ ఫంక్షన్స్‌లలో ఈ ఇద్దరే జంటగా అన్యోన్యంగా కన్పించేవారు. కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా ఇద్దరూ కలిసి చేసేవారంటే ఆ ఇద్దరి మధ్య బంధం ఎంతగా ప్రాచుర్యం పొందిందో అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇటీవల కొద్దికాలంగా దీపికా పదుకోన్-రణ్వీర్ సింగ్‌ల మధ్య మనస్పర్ధలు తలెత్తాయని..ఎడమొహం పెడమొహంగా మారిందని బీ టౌన్ గాసిప్స్ విన్పిస్తున్నాయి. గాసిప్స్ వరకూ పరిమితమైతే ఫరవాలేదు..ఏకంగా ఉత్తరాదికి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ కూడా ఇద్దరి మధ్య బాగాలేదని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. త్వరలోనే విడాకులు తీసుకుంటారని ఉమైర్ సంధూ ట్వీట్ చేశాడు.
అయితే ఓ ఇంటర్వ్యూలో రణ్వీర్ సింగ్ తమ బంధంపై వివరణ ఇచ్చాడు. పదేళ్లకాలంలో అంటే 2012లో దీపికాతో పరిచయమైనప్పటి నుంచి ప్రేమ ఇంకా పెరిగిందంటున్నాడు. దీపికా తన జీవితంలో వచ్చాక మరింత అందంగా మారిందన్నాడు. మరోవైపు ఇవాళ దీపికా పదుకోన్ తన తల్లి ఉజ్జలతో ఎయిర్‌పోర్ట్‌లో కన్పించినప్పుడు దీపికా పదుకోన్ చేతిలో వెడ్డింగ్ రింగ్ లేదు. ఇది చూసిన నెటిజన్లు విడాకుల వార్త నిజమేనంటూ అందుకున్నారు.
అసలు దీపికా పదుకోన్ - రణ్వీర్ సింగ్ మధ్య విభేదాలకు కారణం ఇటీవల వివాదాస్పదంగా మారిన రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ అని తెలుస్తోంది. ఇద్దరి మధ్య వ్యవహారం చెడటానికి కారణం అదేనంటున్నారు.
Also read: Ponniyin Selvan 1 Movie Review : భారీ అంచనాలతో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook