The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలేంటి

The Kashmir Files: ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2022, 05:29 PM IST
The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలేంటి

The Kashmir Files: ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

దేశవ్యాప్తంగా సినీ వీధుల్లో ఎక్కడ ఏ నోట విన్నా..ది కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమా అయినా అప్పుడు వంద కోట్ల మైలురాయి దాటేసింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది. త్వరలో 150 కోట్ల మైలురాయి దాటనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ సినిమాను ప్రశంసించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా చూసేందుకు ప్రభుత్వోద్యోగులకు సెలవులు మంజూరు చేస్తున్నాయి.

మొత్తానికి సంచలనంగా మారిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్ ఖాన్ స్పందించాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీలోని ఓ వేడుకలో ముఖ్య అతిధిగా అమీర్ ఖాన్ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడాడు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారా అనే ప్రశ్నకు అమీర్ స్పందించాడు. సినిమా ఇప్పటివరకూ చూడలేదని..తప్పకుండా చూస్తానని చెప్పాడు. ఇది మన చరిత్రకు నిదర్శనమన్నాడు. కశ్మీర్ పండిట్లకు అలా జరగడం నిజంగా బాధాకరమని విచారం వ్యక్తం చేశాడు. ఇటువంటి సినిమాలను ప్రతి ఒక్క భారతీయుడు చూసి తీరాలని తెలిపాడు. కశ్మీర్ ఫైల్స్ సినిమా విజయవంతమైనందుకు సంతోషంగా ఉందన్నాడు అమీర్ ఖాన్.

Also read: Manchu Manoj: ఆ ఒక్కడు మా అన్నను టార్గెట్ చేశాడు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News