Genelia Re Entry: పదేళ్ల తరువాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న బొమ్మరిల్లు బ్యూటీ

Genelia Re Entry: టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసి వివాహా రీత్యా వెండితెరకు దూరమవుతుంటారు కొందరు. మరి కొందరైతే టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి..తెలుగు సినీ పరిశ్రమకు దూరమవుతుంటారు. ఇప్పుడదే కోవలో ఉన్న బొమ్మరిల్లు బ్యూటీ పదేళ్ల అనంతరం రీ ఎంట్రీ ఇవ్వనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2021, 02:46 PM IST
Genelia Re Entry: పదేళ్ల తరువాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న బొమ్మరిల్లు బ్యూటీ

Genelia Re Entry: టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసి వివాహా రీత్యా వెండితెరకు దూరమవుతుంటారు కొందరు. మరి కొందరైతే టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి..తెలుగు సినీ పరిశ్రమకు దూరమవుతుంటారు. ఇప్పుడదే కోవలో ఉన్న బొమ్మరిల్లు బ్యూటీ పదేళ్ల అనంతరం రీ ఎంట్రీ ఇవ్వనుంది.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా(Boys Movie)తో పరిచయమైన జెనీలియా(Genelia)..చలాకీ పిల్లగా అందిరకీ గుర్తుంటుంది. బాయ్స్ కంటే ఎక్కువగా బొమ్మరిల్లు హాసిని ( Bommarillu Hasini)గా తెలుగింట అందరికీ సుపరిచితమైంది జెనీలియా. బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయిందని చెప్పాలి. ఇప్పటికీ జెనీలియా ఫోటో కన్పిస్తే హాసిని అనే ట్యాగ్ చేస్తుంటారు. ఆ తరువాత రామ్ చరణ్(Ram charan)‌తో తీసిన ఆరెంజ్ సినిమా ( Orange Movie) ఫ్లాప్ కావడంతో జెనీలియా తెలుగు సినీ పరిశ్రమకు దూరమైంది. తెలుగు నుంచి బాలీవుడ్ ( Bollywood)‌కు వెళ్లిన జెనీలియా కొన్ని ప్రముఖమైన సినిమాల్లో మంచి రోల్స్ చేసి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్( Riteish Deshmukh)‌ను పెళ్లి చేసుకుంది. 

పెళ్లైనప్పటి నుంచి జెనీలియా లైఫ్ బిజీ అయిపోయింది.ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జెనీలియా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. చాలా సినిమా ఆఫర్లు వచ్చినా కాదనుకుంది. ఇప్పుడు మళ్లీ పదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత తెలుగు సినిమాకు (Tollywood) మళ్లీ రీ ఎంట్రీ (Re Entry to Tollywood) ఇవ్వనుందని తెలుస్తోంది. రామ్ పోతినేని చేస్తున్న ఓ సినిమాలో ప్రత్యేక పాత్రలో జెనీలియా కన్పించనుంది. రెడీ సినిమా తరువాత ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగుందని టాక్. ఏ ఫంక్షన్ జరిగినా ఒకరికొకరు ఆహ్వానం పంపించుకుంటారు. అందుకే రామ్ పోతినేని సినిమాతో జెనీలియా మళ్లీ తెలుగు సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. 

Also read: Rama Navami 2021: తెలుగు ప్రజలకు టాలీవుడ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు, లేటెస్ట్ పోస్టర్లతో విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News