Brahmamudi March 18th Episode: ఫ్రెండ్స్ ముందు అనామిక పరువు తీసేసిన కల్యాణ్.. అమ్మమ్మ వ్రతం ప్లాన్ వర్కౌట్‌ అవుతుందా?

Brahmamudi March 18th Episode: నేటి ఎపిసోడ్లో ఇంటికి వచ్చిన స్నేహితులకు అనామిక ఇంటి సభ్యులను పరిచయం చేస్తుంది.ఇక అనామిక ధాన్యలక్ష్మిల ఓవర్‌ యాక్టింగ్‌ చూడాలి.. అయితే, ఈ ఆంటీ ఎవరు అని అపర్ణను అడుగుతారు. అప్పుడు కావ్య వాళ్ల అత్త గురించి గొప్పలు చెబుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 18, 2024, 09:52 AM IST
Brahmamudi March 18th Episode: ఫ్రెండ్స్ ముందు అనామిక పరువు తీసేసిన కల్యాణ్.. అమ్మమ్మ వ్రతం ప్లాన్ వర్కౌట్‌ అవుతుందా?

Brahmamudi March 18th Episode: నేటి ఎపిసోడ్లో ఇంటికి వచ్చిన స్నేహితులకు అనామిక ఇంటి సభ్యులను పరిచయం చేస్తుంది.ఇక అనామిక ధాన్యలక్ష్మిల ఓవర్‌ యాక్టింగ్‌ చూడాలి.. అయితే, ఈ ఆంటీ ఎవరు అని అపర్ణను అడుగుతారు. అప్పుడు కావ్య వాళ్ల అత్త గురించి గొప్పలు చెబుతుంది. ఆంటీ కావ్య నా పరువు తీసేలావుంది ఏదైనా చేయండి అంటుంది అనామిక. ఇలానే మాట్లాడతావా? వచ్చినవారికి ఏమైనా ఇస్తావా? అనగానే కావ్య అలాగే అత్తయ్య అని వాళ్లకి కాఫీ, టీ లు ఇస్తుంది కావ్య. మీవారెక్కడా? అని అనామికను ఫ్రెండ్స్ అడిగితే సిటీ మొత్తం 21 బ్రాంచులు ఉన్నాయి కదా.. మొత్తం అంతా ఆయనే చూసుకుంటాడు. చాలా బిజీ అంటారు అనామిక ధాన్యలక్ష్మిలు. దీంతో కుటుంబ సభ్యులంతా బిత్తరపోయి వాళ్లనే చూస్తుంటారు కుటుంబ సభ్యులు. మరి కావ్య వాళ్ల ఆయన ఏంచేస్తారు? అని అడుగుతారు. ఆయన మా ఆయనకు అసిస్ట్‌ చేస్తాడు అని లేనిపోని కథలన్నీ చెబుతారు. అప్పుడే కల్యాణ్ పైనుంచి కిందికి వస్తుంటాడు. అదిగో మా ఆయన వచ్చేసారు అని ఫ్రెండ్స్‌కు కల్యాణ్‌ను పరిచయం చేస్తుంది అనామిక.

 మీరు చాలా గ్రేట్‌ అండీ.. మీరు అంత బిజీ ఉన్న అనామికను బాగా చూసుకుంటున్నారు అంటారు. అప్పుడు ఆశ్చర్యపోయిన కల్యాణ్ చూడండి.. నేను ఏ బిజినెస్ చూసుకోవట్లేదు. మా అన్నయ్యే అన్ని బిజినెస్‌లు చూసుకుంటాడు. నేను కేవలం రైటర్‌ను మీ ముందు నామూషీగా ఉంటుందని అలా చెప్పి ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటాను అంటాడు కల్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అనామిక తలెత్తుకోలేకపోతుంది ఎంటి అనామిక ఇది లేనిపోని గొప్పలు చెప్పుకోవడం దేనికి? మేం మీ ఫ్రెండ్స్‌ కదా.. నువ్వు ఎలాగున్నా మా ఫ్రెండ్. చూడు కల్యాణ్ లాంటి భర్త దొరకడం నీ అదృష్టం నువ్వు మారలేవు, పాత అనామికవే ఇంతమంది ఫ్యామిలీ దొరికింది. మేం హార్ట్‌ చేసి ఉంటే సారీ అని ఫ్లైట్ టైం అవుతుందని ఫ్రెండ్స్ అంతా వెళ్లిపోతారు. మీ ఫ్రెండ్స్‌ కు కల్యాణ్ గురించి అర్థమైంది నీకు అర్థం కాలేదు అంటుంది అపర్ణ. కల్యాణ్ కూడా మీ అబ్బాయి లా గొప్పగా బతికితే నేను కూడా అర్థం చేసుకునే దాన్ని అని చిరగ్గా వెళ్లిపోతారు అనామిక ధాన్యలక్ష్మిలు..

ఇదీ చదవండి: బ్లాక్ డ్రెస్‌లో పరవశంలో తేలిపోతున్న జాన్వీ కపూర్.. దేవర భామ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

ఇక గార్డెన్లో కూర్చున్న కల్యాణ్ వద్దకు వచ్చి నీకు మనశ్శాంతిగా ఉందా? అంటుంది. ధాన్యలక్ష్మి కూడా కల్యాణ్ ను నిలదీస్తుంది. మా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించారు అంటుంది. నా గురించి నాకు తెలుసు అంటాడు కల్యాణ్ అనామికకు కూడా తెలియాలి కదా.. అంటుంది ధాన్యలక్ష్మి. నాకు కాస్త టైం కావాలి కదా.. అంటాడు కల్యాణ్ ఎంత టైం కావాలి అంటుంది అనామిక. వారం టైం ఇస్తాను నువ్వేంటో ప్రూవ్ చేసుకో అంటుంది అనామిక సరే అంటాడు కల్యాణ్. వారంలో ప్రూవ్ చేసుకోకపోతే నేనేం చెబితే అదే చేయాలి అంటుంది అనామిక సరే అంటాడు కల్యాణ్. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక.

ఇంతలో రాజ్ కావ్యలు అందరూ కుటుంబసభ్యులతో కలిసి మాట్లాడుతుంటారు. రేపటికి రాజ్ పెళ్లై ఏడాది అవుతుంది అంటుంది ఇందిరాదేవి. నాకు ఇష్టంలేని వ్యక్తిని సంవత్సరం భరించానా? అనుకుంటాడు రాజ్. వీళ్లు విడిపోరు, నేను వీళ్లతో కలవను ధాన్యలక్ష్మి మీద కోసం కోడలి హోదా కట్టబెట్టాను అని అపర్ణ బాధపడుతుంది. ఇక వీళ్ల పెళ్లిరోజును చాలా గ్రాండ్‌గా చేద్దాం అంటుంది ఇందిరాదేవి. అక్కకు ఇష్టం లేదేమో అని ధాన్యలక్ష్మి నేను లేదని చెప్పానా? నా కొడుకుకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అంటుంది అపర్ణ. నేను మాత్రం కళావతి విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నా అందరి ఇష్టం ఉన్నా లేకున్నా రేపు వాళ్ల పుట్టింటివాళ్లు కూడా ఇక్కడ ఉండాలి అంటాడు అందరూ ఏమై ఉంటుందో అని ఆలోచిస్తారు

ఇదీ చదవండి:  ప్రభాస్ కల్కి కి వాయిదా.. దేవరాకి పోటీ తప్పదా
ఇక గదిలో రాత్రి కావ్య రాజ్‌ ను అడుగుతుంది. నీ నిర్ణయం ఏంటో చెప్పాలి అంటుంది కావ్య రేపు చెబుతానన్నాను కాదా అంటాడు. అందరికీ చెప్పినప్పుడే నీకు చెబుతా అంటాడు ఓవైపు ఇందిరాదేవి కూడా టెన్షన్ పడుతుంది. మరుసటిరోజు ఇందిరాదేవి వ్రతం చేయిద్దామని అంటుంది. ఇప్పటికిప్పుడే వ్రతం అంటే ఎలా అత్తయ్య అని అపర్ణ అంటుంది. అక్కకు వ్రతం చేయించడం ఇష్టం లేదు అంటుంది ధాన్యలక్ష్మి. ఇక రుద్రాణీ కూడా వదినకు ఇష్టం లేని పని ఎందుకు అంటుంది. పెళ్లైన కొత్తలో నగలు తీసుకుంది ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను నా కొడలికి ఇచ్చాను ఇష్టం ఉంటే ఎందుకు అలా చేస్తుంది అక్క అంటుంద ధాన్యలక్ష్మి. ఇష్టం ఉంటే పట్టుచీరైనా కొనివ్వాలి కదా అంటుంది రుద్రాణీ. కావ్యకు నగలు ఇష్టం లేదని చేయించలేదేమో అని ఇందిరాదేవి అంటుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య రాజ్ లు వ్రతం చేస్తూ ఉంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News