Brahmanandam: హాస్యబ్రహ్మ నట ప్రస్తావనకు 56 ఏళ్ళు.. ఈ ఫోటో చూశారా!

Brahmanandam@56 Years: బ్రహ్మానందం గురించి తెలుగులో ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మనం ఉదయం లేచిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో.. ఎక్కడ ఒక దగ్గర ఆయన ఫోటో చూసి నవ్వకుండా ఉండలేం. ఏదైనా సినిమా పెడితే కూడా.. తప్పకుండా ఆయన కనిపించి మనల్ని నవ్విస్తారు. అంతటి పేరు సంపాదించుకున్నారు బ్రహ్మానందం..

Written by - Vishnupriya | Last Updated : Nov 2, 2024, 08:09 AM IST
Brahmanandam: హాస్యబ్రహ్మ నట ప్రస్తావనకు 56 ఏళ్ళు.. ఈ ఫోటో చూశారా!

Brahmanandam Awards: ఆయన చూస్తేనే చాలు మనం ఎన్ని బాధల్లో ఉన్న నవ్వేస్తాము. ఆయన స్క్రీన్ పైన కనిపిస్తే.. నవ్వుల పువ్వులు.. పుయ్యాల్సిందే. ఎల్లప్పుడూ పర్సులో ఉన్న ఆయన ఫోటో తీసి చూసుకుంటానని…టాలీవుడ్ కింగ్ నాగార్జున సైతం చెప్పారు. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మనం ఎంతో ముచ్చటగా బ్రహ్మీ.. అని పిలుచుకునే మన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.

Add Zee News as a Preferred Source

అయితే ఈ హాస్యబ్రహ్మం మనల్ని నవ్వించడం మొదలుపెట్టి దాదాపు 56 సంవత్సరాలు ఆవస్తోంది. దాదాపు 56 సంవత్సరాల క్రితం.. 1968వ సంవత్సరంలో బ్రహ్మానందం కు కాలేజ్ లో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో బహుమతి అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అలాగే అదే సంవత్సరం 1969 లో దొంగ వీరడు అనే నటికలో ఆయనకు ఉత్తమ సపోటింగ్ నటుడిగా అవార్డు కూడా వచ్చింది. వాల్తేర్ లో కాలేజీ లో చదువుకునే టైం.. ఈ అవార్డ్ ను అందుకున్నారు. 

బ్రహ్మానందం చదువుకుంటున్న రోజుల్లో.. అందుకున్న ఈ అవార్డులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటి నుండి ఈ మధ్య బ్రహ్మానందం నటించిన.. రంగమార్తాండ సినిమా వరుకు.. ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డ్స్ అందుకున్నారు. మనల్ని మెప్పించే ఎన్నో పాత్రల్లో కనిపించారు. బ్రహ్మానందం దాదాపు 56 ఏళ్ల నట సినీ ప్రస్థానం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలిందే...

బ్రహ్మానందం హాస్యభరితమైన హావా భావాలు.. ప్రస్తుతం తెలుగు వారి రోజువారి కార్యక్రమాల్లో భాగం అయిపోయాయి అంతే అతిశయోక్తి కాదు. మీమ్స్ రూపంలో.. బ్రహ్మానందం రోజు మనకు కనిపిస్తూనే ఉంటారు..సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు.

 

Also Read: School Half Days: విద్యార్థులకు బిగ్‌ అలెర్ట్‌.. నవంబర్‌ 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే స్కూళ్లు..  

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News