Chinmayi Sripada: కవలలకు తల్లైన వివాదాస్పద సింగర్.. సరోగసీ కామెంట్స్ పై ఏమందంటే?

Chinmayi Sripada welcomes twins: సింగర్ చిన్మయి కవల పిల్లలకు జన్మనిచ్చింది. రాహుల్ రవీంద్రన్ ను వివాహమాడిన ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని గోప్యంగా ఉంచి పిల్లలు జన్మించాక వారి ఫోటోలు షేర్ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2022, 11:15 AM IST
  • కవలలకు తల్లయిన చిన్మయి శ్రీపాద
  • సరోగసీనా అంటూ ప్రశ్నలు
  • ఆసక్తికరమైన స్పందన
Chinmayi Sripada: కవలలకు తల్లైన వివాదాస్పద సింగర్.. సరోగసీ కామెంట్స్ పై ఏమందంటే?

Chinmayi Sripada welcomes twins: సింగర్,  డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన చిన్మయి తరువాతి కాలంలో మహిళలకు అండగా నిలబడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెను కొందరు ఫెమినిస్ట్ అంటే మరికొందరు పురుష ద్వేషి అనేవారు. తన కెరీర్లో డబ్బింగ్ చెప్పిన,  పాటలు పాడిన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఫేమస్ అయిన చిన్మయి హీరో,  తరువాతి కాలంలో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె తాను గర్భవతిని అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. 

కానీ ఆమె 21 జూన్ 2022న ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. తమిళ్ లిరిసిస్ట్ వైరముత్తుపై 'మీటూ' ఆరోపణలు చేసిన తర్వాత,  చిన్మయి సెలబ్రిటీలను మొదలుకొని వివిధ రంగాలలో మహిళలను వివిధ రకాలుగా వేధించే పురుషులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తోంది. వేధింపుల వ్యవహారాలను ఖండిస్తూ నిరంతరం తన స్వరం పెంచుతోంది. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నిరంతరం వ్యక్తిగత దాడులకు గురవుతున్న చిన్మయి ఎక్కువగా పురుష ద్వేషి అనే ముద్ర వేయించుకుంది. 

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే చిన్మయి ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడూ మాట్లాడకుండా తాను కవల పిల్లలకు జన్మనిచ్చానని పోస్ట్ చేసి షాకిచ్చింది. చిన్మయి తన పిల్లల వేళ్లను పట్టుకున్న ఫోటోలను పంచుకుంటూ,  “ట్రిప్టా మరియు శ్రావస్ మా కొత్త,  శాశ్వతమైన ప్రపంచానికి కేంద్ర బిందువు అంటూ కామెంట్ చేసింది. నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్,  ట్విటర్‌లలో నాకు బిడ్డ పుట్టలేదని,  నేను స్త్రీగా పరిపూర్ణంగా లేనని కామెంట్లు చేశారు. కానీ మహిళలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ విషయంలో నేను మౌనంగా ఉన్నాను'' అంటూ కామెంట్ చేసింది.

ఎప్పుడూ చిన్మయి తన వ్యక్తిగత జీవితం,  వివాహ జీవితానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా పేజీలలో ఎక్కువగా షేర్ చేయకపోవడం గమనార్హం. అలాంటిది తనకు బిడ్డలు పుట్టిన విషయాన్ని మాత్రం ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే ఆమె తల్లైన సందర్భంగా ఆమెకు పలువురు సోషల్ మీడియా వేదికగానే శుభాకాంక్షలు తెలియచేస్తుంటే ఒక నెటిజన్  మాత్రం ఆసక్తికరంగా కామెంట్ చేశారు. దేవుడు ఆమెకు ఇద్దరు మగబిడ్డలని ఇచ్చాడు,  కాబట్టి ఆమె ఇక మగవాళ్ళను ద్వేషించదు అంటూ కామెంట్ చేశాడు. 

ఇక మరికొందరు ఆమె సరోగసీ ద్వారా పిల్లలు కన్నదేమో అనే అనుమానం వ్యక్తం చేయగా దానికి ఆమె ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పట్లో సోషల్ మీడియాలో తన పిల్లల ముఖాలను బహిర్గతం చేయనని,  వాళ్ళను తాను రక్షించాలి అనుకోవడం వల్లే తాను గర్భవతిని అనే విషయాన్ని బయట పెట్టలేదని తెలిపింది. తన కవలల కోసం సిజేరియన్ చేసిన సమయంలో తాను భజన పాట పాడానని చిన్మయి వెల్లడించింది.

Also Read: Telugu Cine workers : ఇప్పుడు వస్తున్నది ఎంత.. డిమాండ్ చేస్తున్నది ఎంతంటే?

Also Read: Vijayakanth Toes: సీనియర్ హీరో విజయకాంత్‌కు అనారోగ్యం.. మూడు వేళ్ల తొలగింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News