Telugu Cine workers : ఇప్పుడు వస్తున్నది ఎంత.. డిమాండ్ చేస్తున్నది ఎంతంటే?

Telugu Cine Workers On Strike : టాలీవుడ్ పరిశ్రమకు సినీ కార్మికులు షాక్ ఇచ్చారు. వేతనాలు పెంచాలని సినీ కార్మికుల సమ్మెకు పిలుపునివ్వడంతో నేటి నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి.  ఇక ప్రస్తుతం ఉన్న వేతనం ఎంత? ఇప్పుడు కోరుతున్నది ఎంత  అనేది పరిశీలిస్తే

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2022, 10:29 AM IST
  • టాలీవుడ్ కు షాకిచ్చిన సినీ కార్మికులు
  • నేటి నుంచి టాలీవుడ్ షూటింగ్స్ బంద్
  • ఇప్పుడు ఎంత? డిమాండ్ చేస్తున్నది ఎంత?
Telugu Cine workers : ఇప్పుడు వస్తున్నది ఎంత.. డిమాండ్ చేస్తున్నది ఎంతంటే?

Telugu Cine Workers On Strike : టాలీవుడ్ పరిశ్రమకు సినీ కార్మికులు షాక్ ఇచ్చారు. వేతనాలు పెంచాలని సినీ కార్మికుల సమ్మెకు పిలుపునివ్వడంతో నేటి నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సినీ కార్మికులకు వేతనాలు పెంచాలని ముందు నుంచే నిర్మాతలను కోరుతూ వస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి కోరుతున్నా వేతనాలు పెంచకుండా ఉన్న నేపథ్యంలో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. నేడు షూటింగ్ లకు సిని కార్మికులు హాజరు కాలేదు,  కృష్ణ నగర్లో తమ యూనియన్ ఆఫీస్ లకు సిని కార్మికులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. 

జూనియర్ ఆర్టిస్టుల ను తీసుకెళ్లే బస్సులు,  ఇతర షూటింగ్ వాహనాలను సైతం ఫెడరేషన్ సభ్యులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఉదయం పది గంటల నుంచి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో నిర్మాతల మండలితో ఫిలిం ఛాంబర్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు. అయితే సినీ కార్మికులకు ఇప్పటిదాకా ఉన్న వేతనం ఎంత? ఇప్పుడు కోరుతున్నది ఎంత అనే విషయం మీద చర్చ జరుగుతోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. 

క్లీనర్లు,  ప్రొడక్షన్ బాయ్‌లకు రోజుకు ప్రస్తుతం అల్పాహారం + భోజనం ప్రొడక్షన్ వాళ్ళే పెట్టి,  ఇంటి నుండి పికప్ చేసుకుని రోజుకు రూ. 1145 ఇస్తున్నారు. కానీ వారు 30% పెంపు కోరుతున్నారు అంటే దాదాపు రూ.1488 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే ఆదివారాలు అలాగే సెలవు దినాల్లో ఇప్పుడు రూ. 2290 ఇస్తున్నారు కానీ వారు 2977 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్లకు రోజుకు అల్పాహారం + భోజనం ప్రొడక్షన్ వాళ్ళే పెట్టి రూ. 1055 ఇస్తున్నారు కానీ వారు రూ. 1362 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారాలు మరియు సెలవు దినాల్లో ఇప్పుడు రూ. 2110 ఇస్తుంటే వారు రూ. 2743 గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

లైట్‌మ్యాన్ కు రోజుకు రూ. 1100 ఇస్తుంటే రూ. 1440 డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆదివారాలు,  సెలవు దినాల్లో రూ. 2200 ఇస్తుంటే,  రూ. 2860 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫైటర్స్ కి ఇప్పుడు రూ. 3265 ఇస్తుంటే 4244 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక డ్యాన్సర్లకు ప్రస్తుతం రూ. 2800 ఇస్తుంటే రూ.3640కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వీరు మాత్రమే కాక మిగతా 24 క్రాఫ్ట్స్ కు చెందిన వారు కూడా తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచేవరకు సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ వారు షూటింగ్‌కు రాకూడదని నిర్ణయించారు. ఇక ఈ అంశం మీద ఫిల్మ్ ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.
 Also Read: 
Vijayakanth Toes: సీనియర్ హీరో విజయకాంత్‌కు అనారోగ్యం.. మూడు వేళ్ల తొలగింపు!

Also Read: Deepika Padukone: ప్రభాస్‌తో షూటింగ్ ముగించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకోన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News