Poonakalu Loading Song : పూనకాలు లోడింగ్‌కు బుడ్డోడి డ్యాన్స్.. చిరు చెప్పిన ఆ వీడియో ఇదే

Poonakalu Loading Song చిరంజీవి, రవితేజ కలిసి పూనకాలు లోడింగ్‌ సాంగ్‌, అందులోని స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిరు, రవితేజలు వేసిన స్టెప్పులకు ఓ బుడ్డోడు సైతం కాలు కదిపాడు. థియేటర్లో సీట్లో నిలబడి చిందులు వేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 08:27 PM IST
  • థియేటర్లో వాల్తేరు వీరయ్య సందడి
  • చిరు, రవితేజల పూనకాలు లోడింగ్
  • బుడ్డోడి స్టెప్పులు నెట్టింట్లో వైరల్
Poonakalu Loading Song : పూనకాలు లోడింగ్‌కు బుడ్డోడి డ్యాన్స్.. చిరు చెప్పిన ఆ వీడియో ఇదే

Child Dance for Poonakalu Loading Song మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓవర్సీస్‌లో అయితే వీరయ్య విధ్వంసం చేస్తున్నాడు. మూడు రోజుల్లోనే 1.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక థియేటర్లో విజయవంతంగా ఆడుతూ, ఎక్కువ కలెక్షన్లను రాబడుతోంది.

వాల్తేరు వీరయ్య ఈ రేంజ్‌ సక్సెస్ సాధించడంతో చిరు, రవితేజ, దర్శక నిర్మాతలు ఫుల్ ఖుషీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ చిరంజీవి ఓ బుడ్డోడి గురించి మాట్లాడాడు. సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో చెప్పేందుకు ఉదాహరణగా ఓ ఘటన చెప్పాడు.

 

చాయ్ బిస్కెట్ అనురాగ్ ఓ వీడియోను పంపాడట. అందులో ఓ బుడ్డోడు పూనకాలు లోడింగ్ అని భుజాలు ఎగిరేస్తున్నాడట. స్క్రీన్ మీద తాను రవితేజ కలిసి పూనకాలు లోడింగ్ అంటూ స్టెప్పులు వేస్తుంటే థియేటర్లో చిన్న పిల్లాడు సీట్లో నిల్చుని పూనకాలు లోడింగ్ అనే స్టెప్పులు వేస్తున్నాడట.

అలా చిన్న పిల్లాడిని కూడా తాము జేబులో వేసుకున్నామని, ఇంకో ఇరవై ఏళ్లు అయినా కూడా ఎక్కడికి పోదని, గ్యారంటీ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. అలా వాల్తేరు వీరయ్య ఇప్పుడు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో వీరయ్యే ఆడేస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

 

Trending News