Suhas: స్ట్రాటజీ మార్చిన సుహాస్.. లాభమా.. నష్టమా..?

Suhas Upcoming Movies: కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ క్రమంగా హీరోగా ఎదిగాడు. అలాగని ఏదో ఒకటి రెండు సినిమాలు చేసి ఊరుకోలేదు.. ప్రస్తుతం అతని లైన్ అప్ లో ఉన్న సినిమాల లిస్టు తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2024, 04:41 PM IST
Suhas: స్ట్రాటజీ మార్చిన సుహాస్.. లాభమా.. నష్టమా..?

Suhas Movies: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి క్రమంగా హీరోలుగా మారిన వారు చాలామంది ఉన్నారు. అయితే అలా మారిన వారిలో సక్సెస్ సాధించిన వాళ్లు చాలా తక్కువ మంది అని చెప్పవచ్చు. హీరో సుహాస్ కూడా ఇలా సక్సెస్ సాధించిన వ్యక్తులలో ఒకరు. కమెడియన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ఆ తర్వాత మెల్లిగా విలన్ గా .. హీరోగా ఎదిగాడు. మంచి లీడ్ రోల్స్ తో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఓటీటీలో రిలీజ్ అయిన కలర్ ఫోటో చిత్రానికి మంచి స్పందన రావడంతో రైటర్ పద్మభూషణ్.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు లాంటి చిత్రాలకు మంచి ఆదరణ వచ్చింది.

మొదట్లో సుహాస్ హీరోగా చేస్తున్నాడు అంటే.. హీరోగా సెట్ అయ్యే పర్సనాలిటీ ఉందా అని విమర్శించిన వారు కూడా అతని చిత్రాలు చూశాక ప్రశంసిస్తున్నారు. హీరో కి కావలసింది ఫిజిక్ ఒక్కటే కాదు ప్రేక్షకులను ఆకట్టుకునే నటన అన్న విషయానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా సుహాస్ సక్సెస్ సాధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి ఆఫర్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయని టాక్.ప్రస్తుతం అతను కంప్లీట్ చేసినవి, మేకింగ్ లో ఉన్నవి, త్వరలో సెట్స్ మీదకి వచ్చేవి అన్ని కలుపుకొని అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. అతను నటించిన ప్రసన్న వదనం అనే చిత్రం ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క శ్రీరంగనీతులు అనే మూవీ కూడా త్వరలో విడుదల కాబోతోంది.

అంతే కాదండోయ్.. మన మహానటి కీర్తి సురేష్ జంటగా సుహాస్ అమెజాన్ ప్రైమ్ కోసం ఓ మూవీ చేయబోతున్నారు. సందీప్ రెడ్డి బండ్ల అనే కొత్త డైరెక్టర్ తో మరొక మూవీ ఉండనే ఉంది. ఇవి కాక ఓ భామ అయ్యో రామ‌ అనే సరికొత్త మూవీ రామ్ గోదాల దర్శకత్వంలో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో ఓటీటీలో సెన్సేష‌న్ హిట్ సాధించిన జో తమిళ్ మూవీ తో ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసిన మలయాళీ బ్యూటీ మాళ‌విక మ‌నోజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఒక పక్కా లవ్ స్టోరీ అని టాక్. మొత్తానికి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ తో వరుస సినిమాలు చేస్తూ సుహాస్ ఫుల్ బిజీ యాక్టర్ గా మారిపోతున్నాడు.

అయితే ఈ క్రమంలో కొన్ని సందేహాలు మాత్రం ఏర్పడుతున్నాయి. మొన్నటి వరకు టైం తీసుకుని కేవలం కథ బాగున్న సినిమాలు తీసిన సుహాస్ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడానికి.. కథ చూసి ఒప్పుకున్నారా లేక చాన్సులు వచ్చాయి కదా అని ఒప్పుకునేసారా అని కొంతమంది సందేహ పడుతున్నారు. నిజంగానే ఈ కథలన్నీ బాగుంది సుహాస్ ఒప్పుకో ఉంటే ఆయన క్రేజ్ మరింత పెరగడం ఖాయం.. అలాకాక అవకాశాలు వచ్చాయి కదా అని ఒప్పుకో ఉంటే మాత్రం.. గతంలో కొంతమంది కమెడియన్లు చేసిన తప్పులని సుహాస్ రిపీట్ చేసినట్టు అయిపోతుంది.

Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

 

 

 

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News