Ahimsa OTT: ఎట్టకేలకు మోక్షం... ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి దగ్గుబాటి హీరో సినిమా!

Ahimsa Movie: దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా అహింస. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన ఈ సినిమా ఎట్టకేలకు ఆరు నెలల తర్వత ఓటీటీ ఇచ్చింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2023, 12:38 PM IST
Ahimsa OTT: ఎట్టకేలకు మోక్షం... ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి దగ్గుబాటి హీరో సినిమా!

Ahimsa on Ott: ప్రస్తుత రోజుల్లో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని నెల రోజుల్లోపే ఓటీటీ బాట పడుతుంటే... మరికొన్ని చిత్రాలు నెలల తరబడి డిజిటల్ స్ట్రీమింగ్ కాకుండా ఉండిపోతున్నాయి. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా అరంగేట్రం చేసిన సినిమా అహింస. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. జూన్‌ 2వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్ పూర్తిగా నిరాశ చెందారు.

అయితే అహింస డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ దక్కించుకున్నప్పటికీ స్ట్రీమింగ్ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఓటీటీ కంటే ముందే సెప్టెంబరు నెలలో టీవీల్లోకి వచ్చేసింది అహింస. అయితే ఇది పట్టించుకోని అమెజాన్ ప్రైమ్ సంస్థ తాజాగా మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. 

ఈ చిత్రానికి ఆది నుంచి కష్టాలనే చెప్పాలి. అహింస మూవీ రెండేళ్లు సెట్స్ పైనే ఉంది. చివరకు షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది జూన్‌ 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అయితే హీరో దగ్గుబాటి అభిరామ్ కు బ్రేక్ ఇవ్వలేకపోయింది. డిజాస్టర్ టాక్ రావడంతో రిలీజైన వారం రోజుల్లోనే సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. సక్సెస్ తో కెరీర్ స్టార్ట్ చేద్దామనుకున్న అభిరామ్ కు ఈ మూవీ ఫలితం షాకిచ్చింది. 

Also Read: Tiger 3 OTT Release: ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన సల్మాన్-కత్రినా కైఫ్ టైగర్ 3, ఎందులో, ఎప్పుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News