Sanya Malhotra: దంగల్ మూవీ(Dangal Movie)లో అమీర్ ఖాన్ కూతురుగా నటించి గుర్తింపు పొందిన నటి సాన్యా మల్హోత్రా(Sanya Malhotra). వరుస సినిమాలు, షోలతో దూసుకెళ్తోంది ఈ బాలీవుడ్ నటి. ఈ బ్యూటీ తాజాగా ‘'ససురల్ వండర్ ఫూల్(Sasural Wonder Phool)'’ అనే రొమాంటిక్ కామెడీ షో(Romantic Comedy Show)లో 'అషిమా' అనే పాత్ర పోషిస్తోంది. ఇది అడిబుల్ ప్రసారమయ్యే ఓ పాడ్‌కాస్ట్(PodCast). భారత్‌లో జనాలు శృంగారం గురించి మాట్లాడాలంటే భయపడతారని ఈ భామ తెలిపింది.
ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ సెక్స్(sex) అనే పదం భారత్‌లో నిషిద్ధం. కానీ ఇటీవల సినిమా, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల వల్ల కొద్దిగా మార్పు వస్తోంది. అందుకే ‘'ససురల్ వండర్ ఫూల్'’ వంటి స్టోరీస్‌ని రూపొందించేందుకు క్రియేటర్స్ ముందుకు వస్తున్నార’ని తెలిపింది.
Also read: RGV : ఏపీ నాయకులు త్వరలోనే బాక్సింగ్, కరాటే నేర్చుకోవాలి: ఆర్జీవీ
సాన్యా తన షో గురించి మాట్లాడుతూ.. ‘ఇందులో నేను చేసే ‘అషిమా(Ashima)’ పాత్రకి శృంగారం అనే పదం వాడాలంటే ఇబ్బంది పడుతుంది. అలాంటిది తన భర్త, ఇతర కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన క్లీనిక్(Clinic)ని నడుపుతుంటే.. ఆమె పరిస్థితి ఎంటానేది స్టోరీ’ అని చెప్పింది. మేం ఈ షోతో కొంత మందినైనా మార్చగలమని ఆశిస్తున్నామని తెలిపింది. దీని స్ఫూర్తితో కొందరైనా సరే ఇలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడతారని అనుకుంటున్నామని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి