అల్లు అరవింద్‌ని ఒప్పించిన దిల్ రాజు

దిల్ రాజు విజ్ఞప్తికి ఓకే చెప్పిన అల్లు అరవింద్ 

Last Updated : Jul 21, 2018, 08:27 PM IST
అల్లు అరవింద్‌ని ఒప్పించిన దిల్ రాజు

టాలీవుడ్‌లో అగ్రనిర్మాతలుగా పేరున్న దిల్ రాజు, అల్లు అరవింద్ మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన గీత గోవిందం సినిమా టీజర్ రేపు రిలీజ్ కావాల్సి వుండగా అనుకోకుండా టీజర్ విడుదల జులై 23వ తేదీకి వాయిదా పడింది. అందుకు కారాణం ఏంటా అని ఆరాతీస్తే తెలిసిన అసలు విషయం ఏంటంటే.. దిల్ రాజు చేసిన ఓ విజ్ఞప్తి మేరకే అల్లు అరవింద్ తన సినిమా టీజర్ విడుదల తేదీని ఒక రోజుకు వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న గీతా గోవిందం సినిమా టీజర్ రిలీజ్ కావాల్సి ఉన్న జులై 22వ తేదీనే దిల్ రాజు నిర్మిస్తున్న శ్రీనివాస కళ్యాణం సినిమా టీజర్ సైతం రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే, ఒకే రోజు ఈ రెండు సినిమాల టీజర్లు రిలీజైతే, మీడియాలో ఈ రెండు టీజర్లకు పోలికలు పెడుతూ రకరకాల కథనాలు, ఊహాగానాలు మొదలవుతాయని.. అలా జరగకుండా ఉండాలంటే గీతా గోవిందం టీజర్ విడుదలను ఒక రోజు వెనక్కు వేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడట. దిల్ రాజు చేసిన విజ్ఞప్తికి ఓకే చెప్పిన అల్లు అరవింద్ ఈసారికి తన సినిమా టీజర్ విడుదలని ఒక్క రోజు వెనక్కు తీసుకెళ్లినట్టు సమాచారం. 

గతంలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సినిమాను డైరెక్ట్ చేసిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలోనే ఈ శ్రీనివాస కళ్యాణం సినిమా తెరకెక్కుతోంది. నితిన్, రాశి ఖన్నా జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయక్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రేపే ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుంది. 

Trending News