Harish Shankar Letter: 'కెలుక్కుంటాను అంటే రా చూస్కుందాం' హరీశ్‌ శంకర్‌ సంచలన లేఖ

Harish Shankar Letter On Chota K Naidu Commnts: తెలుగు సినీ పరిశ్రమలో మాటల తూటాలు పేలాయి. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ మధ్య 'రా చూస్కుందాం' అనే స్థాయిలో వివాదం రాజుకుంది. కాస్కో అంటూ సవాళ్ల పర్వం కొనసాగింది.

Last Updated : Apr 20, 2024, 07:43 PM IST
Harish Shankar Letter: 'కెలుక్కుంటాను అంటే రా చూస్కుందాం' హరీశ్‌ శంకర్‌ సంచలన లేఖ

Harish Shankar: సినీ పరిశ్రమలో మరో వివాదం రచ్చకెక్కింది. ఓ సినిమా విషయంలో సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడి మధ్య మాటల యుద్ధం మొదలైంది. 'కాదు కూడదు అని కెలుక్కుంటానంటే మాత్రం నేను ఎక్కడికైనా సిద్ధం.. ఏదో ఒక రోజు.. ఏదైనా ప్లాట్‌ ఫామ్‌ నేను సిద్ధం' అంటూ సంచలన ప్రకటన చేయడంతో ఆ వివాదం కాస్త ముదిరింది. ఈ వివాదం సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మధ్య జరుగుతోంది. పలు ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారి తీశాయి.

Also Read: Low Budget Movies: కంటెంట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. తక్కువ బడ్జెట్‌లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!

 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చోటా కె నాయుడు దర్శకుడు హరీశ్‌ శంకర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కలిసి తీసిన సినిమా 'రామయ్య వస్తావయ్యా'పై ఆ ఇంటర్వ్యూలో నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌ శంకర్‌ వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఇది పరిశ్రమలో తీవ్ర దుమారం రేపింది. చివరకి తన వద్దకు ఈ విషయం రావడంతో హరీశ్‌ శంకర్‌ స్పందించారు. ఈ సందర్భంగా 'ఎక్స్‌' వేదికగా ఓ సంచలన పోస్టు చేశారు.

Also Read: Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?

 

'చోటా కె నాయుడికి నమస్కరిస్తూ.. రామయ్య వస్తాయ్యా సినిమా వచ్చి దాదాపు పదేళ్లు దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకు మీరు పది ఇంటర్వ్యూలు ఇస్తే.. నేను ఒక వంద ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా విషయమై అవమానకరంగా మాట్లాడారు. 

మీకు గుర్తుందో లేదో.. ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్‌తో షూటింగ్‌ చేద్దాం అనే ప్రస్తావన వచ్చింది. కానీ రాజు చెప్పడం మూలంగానో గబర్బసింగ్‌ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ను తీసేస్తున్నారు అని పది మంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మధనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే 'గబ్బర్‌ సింగ్‌' వచ్చినప్పుడు నాది 'రామయ్య వస్తావయ్యా' వస్తే అది నీది అనే వ్యక్తిత్వం కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా.. నా ప్రస్తావన రాకున్నా.. నాకు సంబంధం లేకున్నా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.

ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. కానీ స్నేహితులు, నన్ను అభిమానించే వారు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఇది రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా.. మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా. అందుకే మీరంటే నాకు ఇంకా గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే ఎనీ డే.. ఎనీ ప్లాట్‌ఫామ్‌.. ఐయామ్‌ వెయిటింగ్‌. భవదీయుడు హరీశ్‌ శంకర్‌' అని లేఖ వదిలారు.

వివాదం ఇది
జూనియర్‌ ఎన్టీఆర్‌తో హరీశ్‌ శంకర్‌ 'రామయ్య వస్తావయ్యా' సినిమా చేశాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చోటా కె నాయుడు అందించాడు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 'హరీశ్‌ శంకర్‌తో ఆ సినిమా చేశా. తన టేకింగ్‌ స్టైల్‌లో ఆయన ఉండేవాడు. అస్తమానం అడ్డుపడుతుండేవాడు. చెప్పటానికి చాలాసార్లు ప్రయత్నించా. కానీ వినే పరిస్థితిలో ఉండేవాడు కాదు. దీంతో వదిలేశారు. తనకి ఎలా కావాలో అలా చేశా. వీలైనంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తా. వింటే సరి వినకపోతే వాళ్లకు ఏది కావాలో అది అందులోనూ ది బెస్ట్‌ ప్రయత్నం చేస్తా. నేను చెప్పింది ఎవరైనా వినకపోతే ఒక్క నిమిషం కోపం వస్తుంది. ఆ తర్వాత మామూలైపోతా' అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా నాయుడు వ్యాఖ్యలపై హరీశ్‌ శంకర్‌ ఘాటుగా స్పందించారు.

కాగా ప్రస్తుతం మాస్‌ మహారాజా రవితేజ హీరోగా హరీశ్‌ శంకర్‌ 'మిస్టర్‌ బచ్చన్‌' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. చోటా కె నాయుడు చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర'కు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News