Venkatesh birthday: నేడు వెంకీమామ బర్త్ డే...స్పెషల్ వీడియో విడుదల చేసిన ‘'ఎఫ్ 3'’ టీమ్

Venkatesh birthday: సీనియర్ నటుడు వెంకటేష్ జన్మదినం నేడు. ఆయన 61వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 'ఎఫ్3' టీం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 12:37 PM IST
Venkatesh birthday: నేడు వెంకీమామ బర్త్ డే...స్పెషల్ వీడియో విడుదల చేసిన ‘'ఎఫ్ 3'’ టీమ్

Venkatesh birthday: అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati) పుట్టినరోజు నేడు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే వెంకీమామ ఇవాళ 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రేమ్ నగర్ తో బాలనటుడిగా అరంగేట్రం చేసిన వెంకీ...కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఏ పాత్రనైనా రక్తి కట్టించగల నటుడు వెంకటేష్. అందుకే అందరి హీరోల ఫ్యాన్స్ మెచ్చే ఏకైక నటుడు ఆయన. 

టాలీవుడ్(Tollywood)లో ఎక్కువ రీమేక్ చిత్రాలు చేసిన నటుడిగా వెంకీకు పేరుంది. సోలో హీరోగానే కాకుండా కుర్రహీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటివరకు వెంకీ 74 సినిమాల్లో నటించారు. వెంకటేశ్​ ఏడుసార్లు నంది పురస్కారాలు(Nandi Awards) అందుకున్నారు. 

Also Read: Samantha on Divorce Issue: మళ్లీ మళ్లీ అదే అంశమా...నాకిష్టం లేదు

ఇటీవల నారప్ప, దృశ్యం 2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఆయన త్వరలో ఎఫ్ 3 సినిమా(F3 movie)తో ప్రేక్షకుల మందుకు రానున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా వెంకీకి బర్త్ డే(Happy Birthday Venkatesh) విషెస్ చెప్తూ.. ఓ చిన్న వీడియోను విడుదల చేసింది 'ఎఫ్ 3' చిత్రబృందం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News