Warangal: జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం..భయంతో పరుగులు తీసిన ప్రేక్షకులు..

Akhanda Movie: 'అఖండ' సినిమా ప్రదర్శిస్తున్న ఓ మూవీ థియేటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 03:45 PM IST
Warangal: జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం..భయంతో పరుగులు తీసిన ప్రేక్షకులు..

Warangal Theatre : వరంగల్(warangal)లోని ఓ సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. 

వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన తాజా చిత్రం 'అఖండ'. ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలయ్య-బోయపాటి కాంబో కావడంతో..ఈ సినిమా(Akhanda Movie)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ప్రగ్యాజైశ్వాల్, శ్రీకాంత్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్లన్నీ బాలయ్య అభిమానులతో నిండిపోయాయి. ఈ క్రమంలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న వరంగల్ లోని జెమిని థియేటర్(Gemini theater)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

Also Read: Akhanda Release Review: 'మాస్ కా బాప్'- 'అఖండ' విజయాన్ని అందుకున్న బాలయ్య.. సెలెబ్రిటీస్ విషెస్!

ప్రేక్షకులు మూవీ చూస్తుండగా...ఒక్కసారిగా థియేటర్ లో పొగలు అలుముకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణంగానే థియేటర్ లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News