Game On Teaser : దసరా క్రేజ్‌ను వాడుకుంటోన్న గేమ్ ఆన్ టీం

Game On Teaser With Dasara Movie గేమ్ ఆన్ టీజర్ మూవీని దసరా సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. దసరా సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్‌ దిశగా దుమ్ములేపుతోంది. దసరా సినిమా థియేటర్లలో గేమ్ ఆన్ టీజర్‌ను ప్రదర్శించి ప్రమోషన్లు చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 09:09 PM IST
  • నెట్టింట్లో గేమ్ ఆన్ సందడి
  • బాక్సాఫీస్‌పై దసరా సినిమా దాడి
  • గేమ్ ఆన్ టీం ప్రమోషన్స్
Game On Teaser : దసరా క్రేజ్‌ను వాడుకుంటోన్న గేమ్ ఆన్ టీం

Game On Teaser గీతానంద్, 90 ఎంఎల్  ఫేమ్ హీరోయిన్ నేహా సోలంకి  జంటగా గేమ్ ఆన్ సినిమాతో జంటగా నటించారు. ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి.. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై  ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం  విశేషంగా నిలుస్తుంది. మధుబాల, ఆదిత్య మీనన్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చక్కని స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇపుడు అదే ఉత్సాహంతో టీజర్ ను విడదల చేశారు. నాని హీరోగా నటించిన దసరా సినిమా విడదల అయిన థియేటర్లలో ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ లాగ ఆద్యంతం ఆసక్తిగా ఈ టీజర్ సాగింది.

గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చిందని, నవాబ్ గ్యాంగ్ తమ సినిమా కోసం చక్కని సంగీతం అందించారని నిర్మాత ర‌వి క‌స్తూరి అన్నారు. గతంలో పలు చిత్రాల్లో పని చేసి.. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రానికి టైటిల్ సాంగ్ కి పనిచేశారని నవాబ్ గ్యాంగ్ గురించి చెప్పుకొచ్చాడు.

అంత బిజీలోను తమ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారని పొగిడాడు. రీసెంట్‌గా విడుదల చేసిన రెండో పాటకు కూడా స్పందన  వచ్చిందని అన్నాడు. నాని హీరోగా నటించిన దసరా సినిమాతో మా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. థియేటర్లలో ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉందని అన్నాడు.

గీతానంద్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయని, త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామని తెలిపారు. నిర్మాత ఆస్ట్రేలియా లో ఉన్నా కూడా ఎంతో యాక్టీవ్ గా ప్రతి విషయంలో అప్డేట్ లో ఉంటాడని, ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలని దర్శకుడు దయానంద్ చెప్పుకొచ్చాడు.

Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే

Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News