Bimbisara: కలిసొచ్చిన ‘పాప’ సెంటిమెంట్.. అఖండ, ఆర్ఆర్ఆర్ బాటలోనే బింబిసార!

Girl Sentiment For Nandamuri Family Heros: సుదీర్ఘ గ్యాప్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు పాప సెంటిమెంట్ కలిసి వచ్చిందని అంటున్నారు. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 03:01 PM IST
Bimbisara: కలిసొచ్చిన ‘పాప’ సెంటిమెంట్.. అఖండ, ఆర్ఆర్ఆర్ బాటలోనే బింబిసార!

Girl Sentiment For Nandamuri Family Heros: సుదీర్ఘ గ్యాప్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. ఇప్పటికే చాలా చోట్ల సినిమా చూసిన వారందరూ సినిమా అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ పటాస్ సినిమా తర్వాత మరో హిట్టు కొట్టినట్టు అని వారందరూ చెబుతున్నారు.

నందమూరి అభిమానులు అయితే తమ హీరో హిట్ కొట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత హిట్ కొట్టడంతో వారందరూ కూడా ప్రస్తుతం గాల్లో తేలిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొందరు నందమూరి హీరోలకు పాప సెంటిమెంట్ కలిసి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ముందుగా అఖండ సినిమాలో ఒక చిన్నారితో నందమూరి బాలకృష్ణ సాన్నిహిత్యం సినిమాకు బాగా ప్లస్ అయిందని, సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె పాత్రతో ఆయన కనెక్ట్ అయిన విధానం అఖండకు బాగా కలిసి వచ్చిందని, అందుకే సినిమా హిట్ అయింది అని కూడా కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా కూడా దాదాపుగా పాప చుటూనే తిరుగుతుంది.

గోండు జాతి పాపను తెల్లవాళ్లు తీసుకువెళ్లడంతో ఆమెను రక్షించడం కోసమే ఎన్టీఆర్ అక్కడికి వెళ్లి సినిమా మొత్తానికి హైలైట్ అవుతాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమా బింబిసార కథ కూడా పాప చుట్టూనే తిరుగుతుందని అలా ఈ సినిమాకు కూడా పాప సెంటిమెంట్ కలిసి వచ్చిందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ హిట్లు కొట్టినట్లుగానే కళ్యాణ్ రామ్ కూడా హిట్టు కొట్టాడని సినిమా కలెక్షన్లు కూడా కళ్యాణ్ రామ్ కు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ రామ్ సొంత ప్రొడక్షన్ హౌస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు.

Also Read: Bimbisara Movie: హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్.. కాలర్ ఎగరేస్తున్న నందమూరి ఫాన్స్!

Also Read: Bimbisara Review: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News